నేను చిన్నప్పుడు ఇదే పాఠశాలలో చదువుకున్నా : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

by Dishanational1 |
నేను చిన్నప్పుడు ఇదే పాఠశాలలో చదువుకున్నా : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
X

దిశ, అలంపూర్: తెలంగాణ వచ్చి 9 ఏళ్ళు అయినా ఇంకా పల్లెటూర్లకు బస్సు సౌకర్యాలు లేవని ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మంగళవారం అలంపూర్ మండలంలో మూడో రోజు బహుజన యాత్ర కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన అలంపూర్ పట్టణ కేంద్రంలోని వార్డులను తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇస్త్రీ పనిచేసేవారు, పండ్లు అమ్ముకునేవారిని కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా అలంపూర్ ప్రభుత్వ బాలుర పాఠశాలను సందర్శించారు. చిన్నప్పుడు ఇదే పాఠశాలలో చదువుకున్నానని చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. కొద్ది సేపు విద్యార్థులతో ముచ్చటించారు. మీరు కూడా నాలాగే బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.


తర్వాత బైరాపురం, గొందిమల్ల, బుక్కాపురం గ్రామాలను సందర్శించి ప్రతి ఒక్కరిని కలిసి సమస్యలను తెలుసుకున్నారు. తెలంగాణ వచ్చి 9 ఏళ్ళు అయినా గ్రామాలకు బస్సు సౌకర్యం లేదన్నారు. బైరాపురం గొందిమల్ల బుక్కాపురం గ్రామాలకు బస్సు సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే తానే ఫోన్ చేసి బస్సు వచ్చేలా చేశానని తెలియజేశారు. పేరుకే ఆర్డీఎస్ కానీ నీరు పారేది లేదని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక అలంపూర్ మండల సమస్యలు అన్ని పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అలంపూర్ నియోజకవర్గ గద్వాల జిల్లా అధ్యక్షులు ఎం సి కేశవరావు, నియోజకవర్గం అధ్యక్షులు మహేష్ ఉపాధ్యక్షులు యామని సుంకన్న, నియోజకవర్గం ఇన్చార్జి కనకం బాబు, మండల అధ్యక్షులు నాగరాజు, నాయకులు తదితరులు ఉన్నారు.

Next Story

Most Viewed