నిరుద్యోగ భహిరంగ సభ పై సమీక్ష..

by Disha Web Desk 20 |
నిరుద్యోగ భహిరంగ సభ పై సమీక్ష..
X

దిశ, మక్తల్ : ష మక్తల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత బహిరంగ సభ విజయవంతం పై ముఖ్యనాయకులతో అవగాహన సదస్సు నిర్వహించగా పార్లమెంట్ ఇంచార్జ్ వేణు గౌడ్ హాజరయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు సమావేశం నిర్వహించగా నిరుద్యోగ యువత భవిష్యత్తు. మన నీళ్ళు, నిధులు, నియాకాల కోసం తెచ్చుకున్న తెలంగాణను రాష్ట్ర ప్రభుత్వం వారి స్వలాభాల కోసం మాత్రమే వినియోగించుకుంటుంది. నిరుద్యోగులు రోజురోజుకు పెరుగుతూ పోతున్నారు. బదిలీల ఇతర కారణాల వల్ల ఖాళీ అవుతున్న పోస్టులు రోజురోజుకు పెరుగుతూ పోతున్నాయని.

ఖాళీలు ఉన్నా ప్రభుత్వం నిరుద్యోగాల భర్తి కల్పంచడం లేదన్నారు. నిరుద్యోగ ర్యాలీలో పాల్గొనేందుకు ప్రియాంక గాంధీ మే 8న హైదరాబాద్ లోని సరూర్ నగర్ స్టేడియంలో భారీ భహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారని. నిరుద్యోగ యువత భవిష్యత్తు తమ చేతిలోనే ఉందని అందుకు బీఆర్ఎష్ ప్రభుత్వానికి తెలిసి వచ్చే విధంగా పెద్ద ఎత్తున సభకు తరలివచ్చి, విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో మక్తల్ మండల అధ్యక్షుడు గణేష్ కుమార్, మాగనూర్ ఆనంద్ గౌడ్, క్రిష్ణరాజప్ప గౌడ, ఉట్కూర్ యగ్నేశ్వర్ రెడ్డి, నర్వ చెన్నయ్య సాగర్, అమరచింత మహేందర్ రెడ్డి, ఆత్మకూరు పరమెష్, శ్రీను, జిల్లా జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి, మైనార్టీ సెల్ నూరుద్ధిన్, ఎస్సీ సెల్ గోలపల్లి నారాయణ, శ్రీనివాసులు, రవి కుమార్, గోవర్ధన్, సూర్య కుమార్, నరసింహ పాల్గొన్నారు.


Next Story

Most Viewed