- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు అందజేసిన దౌల్తాబాద్ ఎస్సై
by Ratna Kumari |
పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) పోర్టల్ ద్వారా ట్రేస్ చేసి, వాటిని తిరిగి బాధితులకు అందజేసినట్లు దౌల్తాబాద్ సబ్ ఇన్‌స్పెక్టర్ వేణుకుమార్ తెలిపారు.

X
దిశ, కొడంగల్ : పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) పోర్టల్ ద్వారా ట్రేస్ చేసి, వాటిని తిరిగి బాధితులకు అందజేసినట్లు దౌల్తాబాద్ సబ్ ఇన్‌స్పెక్టర్ వేణుకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ సలీంపూర్ గ్రామానికి చెందిన మల్లేష్, ఈర్లపల్లి గ్రామానికి చెందిన నాయికోటి బందెప్ప తమ ఫోన్లు పోయినట్లు ఫిర్యాదు చేయడంతో.. సీఈఐఆర్ పోర్టల్‌లో వాటి వివరాలను నమోదు చేశామన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఫోన్లు పోగొట్టుకున్న వారు వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని లేదా స్వయంగా సీఈఐఆర్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. ఫోన్లు తిరిగి రావడంతో బాధితులు హర్షం వ్యక్తం చేస్తూ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
Next Story






