గద్వాల మున్సిపల్ బరిలో 'గులాబీ' జెండానే లక్ష్యం

by Nallavelli.Anjaneyulu |

గద్వాల మున్సిపాలిటీలో బిఆర్ఎస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పార్టీ అభ్యర్థులను బరిలో నిలుపుతుందని మాజీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ డా. ఆంజనేయులు గౌడ్

గద్వాల మున్సిపల్ బరిలో గులాబీ జెండానే లక్ష్యం
X

దిశ, జోగులాంబ ప్రతినిధి : గద్వాల మున్సిపాలిటీలో బిఆర్ఎస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పార్టీ అభ్యర్థులను బరిలో నిలుపుతుందని మాజీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ డా. ఆంజనేయులు గౌడ్ పేర్కొన్నారు. గురువారం జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ డా. ఆంజనేయులు గౌడ్, నియోజకవర్గ ఇంచార్జి బాసు హనుమంతు నాయుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ బీఎస్. కేశవ్ కలిసి గద్వాల టౌన్ మున్సిపల్ అభ్యర్థుల మొదటి జాబితాను (17 వార్డులు) అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. గద్వాలలో విచిత్రమైన రాజకీయం నడుస్తోందని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీలు పైకి వేర్వేరు పార్టీలుగా కనిపిస్తున్నా, మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం ఆ రెండు పార్టీల అభ్యర్థుల గూడు ఒక్కటేనని ఆరోపించారు. ప్రత్యర్థుల వద్ద ధనబలం, ముఠాబలం ఉండొచ్చు కానీ, తమ వద్ద కార్యకర్తల బలమే శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. కేసీఆర్, కేటీఆర్‌లకు మున్సిపల్ పీఠాన్ని బహుమతిగా ఇస్తామని తెలిపారు. కాంగ్రెస్ సర్కార్ ప్రజా వ్యతిరేక పాలనను సాగిస్తోందని, ఆ పార్టీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని నాయకులు తెలిపారు. ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేసి అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

మొదటి విడత అభ్యర్థుల జాబితా :

2 వ వార్డు కర్నూల్ దివ్య జనరల్ మహిళ

5 వ వార్డు చిన్న సంటెన్న జనరల్

8 వ వార్డు జయమ్మ బీసీ మహిళ

10 వ వార్డు చాంద్ బీ జనరల్ మహిళ

12 వ వార్డు లత జనరల్ మహిళ

14 వ వార్డు రాజ్ కుమార్ జనరల్

16 వ వార్డు జీ. శశిరేఖ జనరల్ మహిళ

24 వ వార్డు రియాజ్ జనరల్

27 వ వార్డు విజయలక్ష్మి ఎస్టీ

28 వ వార్డు కళావతి జనరల్

29 వ వార్డు శ్రీనివాస్ రెడ్డి బీసీ జనరల్

30 వ వార్డు విజయకుమార్ బీసీ జనరల్

31 వ వార్డు సుజాత ఎస్సీ మహిళ

32 వ వార్డు రేణుక జనరల్ మహిళ

33 వ వార్డు స్వేత బీసీ మహిళ

36వ వార్డు సునీత జనరల్ మహిళ

37 వ వార్డు మంజులా రాణి బీసీ మహిళ

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పటేల్ జనార్దన్ రెడ్డి, కోటేష్, బీచుపల్లి, యూసఫ్, శ్రీరాములు, ఎండి మాజ్, ముజీబ్, నరసింహులు, రవి టౌన్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story