బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ అమ‌లు చేయాల‌ని ఎమ్మార్వోకు విన‌తి

by Ratna Kumari |

దిశ‌, క‌ల్వ‌కుర్తి : కుల్వ‌కుర్తి బీసీ జేఏసీ ఆధ్వ‌ర్యంలో బుధ‌వారం త‌హ‌శీల్దార్ కార్యాల‌యంలో ఎమ్మార్వోకి 42 శాతం రిజ‌ర్వేష‌న్ సాధ‌న‌కు విన‌తిప‌త్రం అంద‌జేశారు. ఈ

బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ అమ‌లు చేయాల‌ని ఎమ్మార్వోకు విన‌తి
X

దిశ‌, క‌ల్వ‌కుర్తి : కుల్వ‌కుర్తి బీసీ జేఏసీ ఆధ్వ‌ర్యంలో బుధ‌వారం త‌హ‌శీల్దార్ కార్యాల‌యంలో ఎమ్మార్వోకి 42 శాతం రిజ‌ర్వేష‌న్ సాధ‌న‌కు విన‌తిప‌త్రం అంద‌జేశారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహం నుంచి బీసీ జేఏసీ నేతలు ర్యాలీగా ఎంఆర్ఓ ఆఫీస్ వద్దకు నినాదాలు చేసుకుంటూ వెళ్లి తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ నేతలు సదానంద గౌడ్, రుక్కుల్ గౌడు, గోపాల్ మాట్లాడుతూ 42శాతం బీసీ రిజర్వేషన్స్ అమలు స్థానిక సంస్థల ఎన్నికలు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్స్ సాధన కోసం మరో స్వాతంత్ర పోరాటం లా ఉద్యమించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లి ప్రధానమంత్రి , రాష్ట్రపతిని కలిసి బీసీ రిజర్వేషన్ల సమస్యకు పరిష్కారం చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో కరెంటు రాజ,న్న మార్చల సురేష్, సుధాకర్ శ్రీనివాస్, రమేశ్, భానుచందర్, బాబీ దేవ్ భగత్ సింగ్, సురేందర్ గౌడ్, సోమాజీ, రామకృష్ణ, ధారమని గణేష్ పాల్గొన్నారు.

Next Story