జిల్లా అధికారులకు ఎమ్మెల్యే మాట అంటే లెక్క లేదా...?

by Disha Web Desk 20 |
జిల్లా అధికారులకు ఎమ్మెల్యే మాట అంటే లెక్క లేదా...?
X

దిశ, తాడూరు : జిల్లా అధికారులకు ఎమ్మెల్యే మాట అంటే లెక్క లేదా అని అధికారుల పై సిరసవాడ ఎంపీటీసీ రమేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం అధికారులు మండల సమావేశం మందిరంలో ఏర్పాటుచేసిన సర్వసభ్య సమావేశం ఎంపీపీ గుర్రాల శ్రీదేవి అధ్యక్షతన నిర్వహించారు. గత సర్వసభ సమావేశంలో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పాల్గొని వచ్చే సర్వసభ సమావేశంలో సంబంధిత జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని ఆయన అధికారులను ఆదేశించారు. అయినా జిల్లా అధికారులు హాజరు కాకపోవడంతో ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీడీవో గంగా మోహన్ కల్పించుకుని మేము మా వంతు బాధ్యతగా ప్రోటోకాల్ ప్రకారం ఎజెండా అంశాల పత్రాన్ని అందరూ జిల్లా అధికారులకు ప్రజాప్రతినిధులకు అందజేశామని జిల్లా అధికారులను హాజరుకావాలని ఆదేశించే అధికార మాకు లేదని ఆయన వివరణ ఇచ్చారు.

ఆయా శాఖల అధికారులు తమ ఎజెండా అంశాల పై సభ్యులకు వివరించారు. తాడూరు గ్రామ ఎంపీటీసీ సంధా రేణుక మాట్లాడుతూ గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాల నిర్మాణం ఎందుకు ఇంకా పూర్తికావడం లేదని విద్యాశాఖ అధికారి భాస్కర్ రెడ్డిని ప్రశ్నించారు. వేరే పాఠశాలల్లో తరగతులు నిర్వహించడంతో విద్యార్థులకు ఇబ్బందులు అవుతున్నాయని ఆమె సభ దృష్టికి తెచ్చారు. ఓ 10వ తరగతి విద్యార్థికి తరగతి గదిలో కిటికీ ఊడిపోవడంతో తలకు బలమైన గాయాలు అయ్యాయని ఆమె అన్నారు. ఇకనైనా కొత్త పాఠశాల త్వరగా నిర్మాణం పూర్తిచేయాలని ఆమె డిమాండ్ చేశారు. అదేవిధంగా తాడూరు మండలం చెందిన రెసిడెన్షియల్ పాఠశాలను, తెలకపల్లి మండల కేంద్రంలో నిర్వహిస్తున్నారని, ఆ పాఠశాలను వచ్చే విద్యా సంవత్సరానికి తాడూరు మండల కేంద్రంలో నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని సభ దృష్టికి తెచ్చారు . ఈ కార్యక్రమంలో డి ఎల్ పి ఓ రామ్మోహన్ రావు, తాసిల్దార్ కార్తీక్, జెడ్పిటిసి మందడి రోహిణి ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, అధికారులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed