అంబేద్కర్ రాసిన రాజ్యాంగ స్ఫూర్తితోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం..

by Disha Web Desk 20 |
అంబేద్కర్ రాసిన రాజ్యాంగ స్ఫూర్తితోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం..
X

దిశ, జడ్చర్ల : అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అంబేద్కర్ కలలుగన్న ఆశయాలకు అనుగుణగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో పాలన కొనసాగిస్తూ దళితుల అభ్యున్నతికి కృషి చేస్తూ దళితుల జీవితాల్లో పెను మార్పులు తెచ్చారని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కొనియాడారు. జడ్చర్ల సిగ్నల్ గడ్డ వద్ద అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి వేడుకలకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ స్ఫూర్తితోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందన్నారు.

అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. దళితులు ఆత్మగౌరవంతో బతకాలని దళితబంధు తీసుకొచ్చారని, ఇలాంటి పథకం దేశంలో ఎక్కడా లేదన్నారు. దళితబంధు లబ్ధిదారులు నేడు గౌరవంగా ఉన్నతమైన జీవితాన్ని గడుపుతున్నారన్నారు. దళితుల అభ్యున్నతికి కృషి చేసిన ఏకైక ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. అట్టడుగు వర్గాలు అభివృద్ధి చెందాలని పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి ఇలాంటి పథకాలు తీసుకొచ్చారని గుర్తుచేశారు. హైదరాబాద్ లో నేడు ఆవిష్కరించనున్న 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహం దేశంలోనే ఎక్కడ లేదన్నారు. కులమతాల పేరుతో చిచ్చు పెట్టే వారి మాయలోపడొద్దని, అందరు కలిసిమెలిసి ఐక్యంగా ఉండాలని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు.

అనంతరం పట్టణంలోని పాత బజార్, పలు కూడలల్లో అంబేద్కర్ విగ్రహానికి, పటాలకు పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర చైర్మన్ వాల్యా నాయక్, జడ్పీ వైస్ చైర్మన్ కోడుగల్ యాదయ్య, డీసీఎంఎస్ చైర్మన్ పట్ల ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ దోరేపల్లి లక్ష్మి, వైస్ చైర్మన్ సారిక, అంబేద్కర్ సంఘ నాయకులు కొంగలి నాగరాజు, టైగర్ జంగయ్య, దగ్గుల బాలరాజు, రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రణీల్ చందర్, కౌన్సిలర్లు, మూడా డైరెక్టర్లు, తాసిల్దార్ లక్ష్మీనారాయణ, మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ షేక్, పట్టణ సీఐ రమేష్ బాబు, పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు వివిధ పార్టీల నాయకులు దళిత సంఘాల నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



Next Story

Most Viewed