- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తరాలు మారినా తరగని జ్ఞాపకాలు
తరాలు మారినా తరగని జ్ఞాపకాల తీపి గుర్తులు ఇంకా మిగిలే ఉన్నాయని, ఈ ఆత్మీయత ఇలాగే కొనసాగుతూనే ఉండాలని యాభై ఏళ్ల క్రితం జూనియర్ లెక్చరర్, విశ్రాంత ప్రధానాచార్యులు అర్విణి రాజేంద్రబాబు అన్నారు.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : తరాలు మారినా తరగని జ్ఞాపకాల తీపి గుర్తులు ఇంకా మిగిలే ఉన్నాయని, ఈ ఆత్మీయత ఇలాగే కొనసాగుతూనే ఉండాలని యాభై ఏళ్ల క్రితం జూనియర్ లెక్చరర్, విశ్రాంత ప్రధానాచార్యులు అర్విణి రాజేంద్రబాబు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో జరిగిన 50 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఎంవీఎస్ జూనియర్ కళాశాల 1974-76 బ్యాచ్ ఇంటర్మీడియట్ పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం లో ఆయన పాల్గొని మాట్లాడారు. గత యాభై ఏళ్ల క్రితం తాను ఎంవీఎస్ జూనియర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్ గా ఇంగ్లీష్ బోధించానని, తన శిష్యులందరూ ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారని ఆయన సంతోషం వ్యక్తంచేశారు. చదువు తోనే తెలివితేటలు, సంస్కారం, గౌరవం లభిస్తుందని, తమ మనుమలు,మనవరాళ్లను ఉన్నతంగా చదివించి సమాజానికి మేలు చేసే విధంగా తీర్చిదిద్దాలని ఆయన ఆకాంక్షించారు. తాము చదువుతున్న కళాశాలకు ఇంకా ఉన్నత స్థాయికి ఎదిగేందుకు తమ వంతు సహకారం అందిస్తామని అప్పటి పూర్వ విద్యార్థులు తెలిపారు. అనంతరం విశ్రాంత ఆచార్యులు సత్యనారాయణ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, లక్ష్మినారాయణ తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమాన్ని వేణుమధు, సత్యనారాయణ, బస్వంతరెడ్డి, కృష్ణకుమార్, శ్రీనివాసశర్మ,రాజేశ్వర్, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.






