రాష్ట్రంలో వైద్య విద్య డేంజర్ లో పడింది: మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి

by Disha Web Desk 1 |
రాష్ట్రంలో వైద్య విద్య డేంజర్ లో పడింది: మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి
X

దిశ, ప్రతినిధి నాగర్ కర్నూల్: రాష్ట్రంలోని వైద్య విద్య పూర్తిగా డేంజర్ లో పడిందని ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించకుండా ప్రభుత్వం వైద్య కళాశాలలను భ్రష్టు పట్టించిందని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. బుధవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ మంత్రి హరీష్ రావు వేదికలపై చేసే ప్రసంగాలను వింటే సిగ్గు అనిపిస్తుందని మండిపడ్డారు.

కనీసం ఏడేళ్ల అనుభవం ఉన్న వారికి ప్రొఫెసర్లుగా అవకాశం ఉంటుందని, అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రొఫెసర్లను నియమించకుండా వైద్య విద్యను ఎలా కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు. వచ్చే నెల జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ను అడ్డం పెట్టుకొని హాథ్ సే హాథ్ జోడో వాల్ పోస్టర్లను తొలగిస్తున్నారని మండిపడ్డారు. ప్రజల అనుమతితోనే ప్రజల ఇంటి గోడలపై వేసిన స్టిక్కర్లను ఎన్నికల కోడ్ తో సంబంధం లేకున్నా తొలగించడంపై రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి హాథ్ సే హాథ్ జూడో యాత్రకు విశేష స్పందన లభిస్తుందన్నారు. ఆ విషయాన్ని జీర్ణించుకోలేక అధికార యంత్రాంగాన్ని వాడుకొని బీఆర్ఎస్ తమను ఇబ్బందులుకు గురి చేస్తోందని ఆరోపించారు. సమావేశంలో ఆయనతో పాటు డీసీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి అర్థం రవి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



Next Story