- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మానసిక ఉల్లాసం కోసమే 'హ్యాపీ సండే' : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మానసిక ఉల్లాసం, ఉత్సాహం, ఆరోగ్యం కోసం ' హ్యాపీ సండే' కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : మానసిక ఉల్లాసం, ఉత్సాహం, ఆరోగ్యం కోసం ' హ్యాపీ సండే' కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక' లో భాగంగా ప్రతి ఆదివారం స్థానిక స్టేడియం గ్రౌండ్ కమాన్ వద్ద ఏర్పాటు చేసిన 'హ్యాపీ సండే' కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థుల తమ ప్రతిభ, సీనియర్ సిటిజన్ లు, కళాకారుల ప్రదర్శనతో ఉత్సాహభరితంగా ఉండేందుకు చేపట్టామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డ్యాన్స్ ప్రదర్శనలు, ఫ్లోక్ సాంగ్స్, మ్యాజిక్ షో, కరాటే, జూడో ప్రదర్శన, యోగాసనాలు, ముఖ్యంగా సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో నగరపాలక మేయర్ మమత, ముడా చైర్మెన్ లక్ష్మణ్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మెన్ మల్లు నర్సింహారెడ్డి, కార్పొరేటర్లు, మున్సిపల్ కమిషనర్ రామానుజుల రెడ్డి, సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు జగపతిరావు, ఉపాధ్యక్షుడు రాజసింహుడు, ప్రధాన కార్యదర్శి నస్కంటి నాగభూషణం, కోటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.






