సింగిల్ విండో చైర్మన్‌గా మరో సారి బాధ్యతలు చేపట్టిన గురువయ్య గౌడ్

by Ratna Kumari |

చారకొండ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్‌గా జెల్ల గురువయ్య గౌడ్ మరోసారి బాధ్యతలు స్వీకరించారు.

సింగిల్ విండో చైర్మన్‌గా మరో సారి బాధ్యతలు చేపట్టిన గురువయ్య గౌడ్
X

దిశ, చారకొండ : చారకొండ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్‌గా జెల్ల గురువయ్య గౌడ్ మరోసారి బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన పాలకవర్గాల ఎంపిక చేపట్టే వరకు పాత పాలకవర్గాలనే కొనసాగించాలని హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో గురువారం ఉదయం 10 గంటలకు సింగిల్ విండో కార్యాలయంలో ఆయన చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా గురువయ్య గౌడ్ మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి, సహకార వ్యవస్థ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. గత కాలపరిమితిలో రైతుల భాగస్వామ్యంతో ప్యాక్స్ చేసిన అభివృద్ధిని కొనసాగిస్తూ, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి పాలకవర్గ సభ్యులందరి సహకారంతో ముందుకెళ్తామని పేర్కొన్నారు. బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి మండల పరిధిలోని రైతులు, ప్రజా ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, యువజన సంఘాల నేతలు, వ్యాపారులు తదితరులు హాజరయ్యారు.

Next Story