- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వృద్ధులు తమ ఆస్తిని తమ పేరు మీదనే ఉంచుకోవాలి : కలెక్టర్ విజయేందిర బోయి
దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : వృద్ధులు తమ ఆస్తిని తమ పేరు మీదనే ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు. అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాల ముగింపు

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : వృద్ధులు తమ ఆస్తిని తమ పేరు మీదనే ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు. అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాల ముగింపు సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా సంక్షేమ అధికారిణి జరీనా బేగం ఆధ్వర్యంలో జరిగిన ముగింపు సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించి ప్రసంగించారు. పిల్లలు ఆస్తిని తమ పేరు మీదకు మార్చుకున్న తర్వాత నిర్లక్ష్యం చేసి, వారి ఆలనాపాలనా చూడని సంఘటనలు చాలా ఉన్నాయని ఆమె అన్నారు. ఆస్తిని తమ పేరు మీద బదిలీ అయ్యాక సరిగ్గా చూసుకోకపోతే ఆస్తిని తిరిగి పొందడానికి ఆర్డీవో ను కాని, కోర్టును కాని ఆశ్రయించ వచ్చని ఆమె అన్నారు. వృద్ధుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా అధికారులను ఆమె ఆదేశించారు. జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాల్లో 60 ఏండ్లు దాటిన వృద్ధుల జాబితా రిజిస్టర్ ను మండల, గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉంచాలన్నారు. ప్రస్తుతం జడ్చర్ల లో ఉన్న వృద్ధాశ్రమాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని, త్వరలో మహబూబ్ నగర్ పట్టణంలో వృద్ధులు 'డే కేర్' సెంటర్ ను ప్రారంభిస్తామని, జిల్లా కేంద్రంలో ప్రభుత్వ వృద్ధాశ్రమ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయని కలెక్టర్ తెలిపారు. అనంతరం 22 మంది సీనియర్ సిటిజన్ లను ఆమె శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి,జడ్జి ఇందిర, జడ్పిసిఈఓ వెంకట్ రెడ్డి, సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు జగపతిరావు, ఉపాధ్యక్షుడు రాజసింహుడు, నస్కంటి నాగభూషణం, జడ్చర్ల ఫోరం అధ్యక్షుడు నయిమోద్దీన్, నవాబుపేట అధ్యక్షుడు నర్సింహులు, జి.పాండురంగం పాల్గొన్నారు.






