- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంగన్ వాడీ టీచర్లకు సెల్ ఫోన్ల పంపిణీ
వంగూరు సెక్టార్‌కు చెందిన అంగన్ వాడీ టీచర్లకు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన సెల్ ఫోన్లను అందజేశారు. కల్వకుర్తి పట్టణంలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయ ఆవరణలో మొబైల్స్ పంపిణీ చేశారు.

X
దిశ, వంగూర్ : వంగూరు సెక్టార్‌కు చెందిన అంగన్ వాడీ టీచర్లకు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన సెల్ ఫోన్లను అందజేశారు. కల్వకుర్తి పట్టణంలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయ ఆవరణలో మొబైల్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్ వైజర్ దేవమ్మ మాట్లాడుతూ.. అంగన్ వాడీ టీచర్లు రోజు వారీ విధులను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ సెల్ ఫోన్లను అందజేసిందని తెలిపారు. పిల్లల హాజరు, పోషణ కార్యక్రమాలు, గర్భిణీ స్త్రీల వివరాలు వంటి సమాచారాన్ని సకాలంలో నమోదు చేసి ప్రభుత్వానికి చేరవేయడానికి ఈ ఫోన్లు ఉపయోగపడతాయని చెప్పారు. అంగన్ వాడీ కేంద్రాల్లో సేవల నాణ్యతను పెంపొందించడంలో ఈ చర్య కీలక పాత్ర పోషిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, అంగన్ వాడీ సిబ్బంది పాల్గొన్నారు.
Next Story






