డయాగ్నోస్టిక్ సెంటర్ల తప్పుడు నివేదికలు.. గర్భిణుల జీవితాలతో చెలగాటం.!

by Bhanu |

జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్ల నిర్లక్ష్యం మరొకసారి బయటపడింది.

డయాగ్నోస్టిక్ సెంటర్ల తప్పుడు నివేదికలు.. గర్భిణుల జీవితాలతో చెలగాటం.!
X

దిశ, గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్ల నిర్లక్ష్యం మరొకసారి బయటపడింది. నిబంధనలు పాటించని ల్యాబ్‌లు గర్భిణి మహిళలకు తప్పుడు నివేదికలు ఇవ్వడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. తాజాగా అయిజ మండలానికి చెందిన ఓ గర్భిణిపై జరిగిన అనుభవం దీని తాలూకు ఉదాహరణగా మారింది.

ఆమె జోగులాంబ డయాగ్నోస్టిక్స్‌లో పరీక్ష చేయించగా గర్భంలో ఉమ్మనీరు 3.4 సెం.మీ.గా తక్కువగా ఉందని తేల్చారు. దీంతో వైద్యులు అత్యవసరంగా గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడి వైద్యులు అనుమానం వ్యక్తం చేయడంతో మరోసారి క్రాంతి డయాగ్నోస్టిక్స్‌లో పరీక్షలు నిర్వహించగా ఉమ్మనీరు స్థాయి 11.12 సెం.మీ.గా ఉందని వెల్లడైంది. ఈ వ్యత్యాసంతో కుటుంబ సభ్యులు తీవ్ర గందరగోళంలో పడ్డారు.

ఇలాంటి తప్పుడు రిపోర్టులు ప్రజలను అవసరంలేని చికిత్సలు, ఆసుపత్రులు మారే పరిస్థితుల్లోకి నెట్టేస్తున్నాయి. దీని వల్ల మానసిక ఒత్తిడితోపాటు ఆర్థికంగా నష్టపోతున్నారు. జిల్లాలో అనుమతి లేని డయాగ్నోస్టిక్ ల్యాబ్‌లు, శిక్షణ లేని సిబ్బంది ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజల ఆరోగ్యాన్ని గాలికొదిలేస్తున్న డయాగ్నోస్టిక్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆరోగ్యశాఖ అధికారులు మేలుకుని తక్షణంగా జోక్యం చేసుకోవాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


Next Story