శాంతి భద్రతలకు రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్

by Ratna Kumari |

మున్సిపల్ ఎన్నికలు నేపథ్యంలో రౌడీ షీటర్లు, ఇతర ఏ వ్యక్తులైనా కానీ శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చ‌రించారు.

శాంతి భద్రతలకు రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికలు నేపథ్యంలో రౌడీ షీటర్లు, ఇతర ఏ వ్యక్తులైనా కానీ శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే కేసులు నమోదు చేస్తామని టూ టవున్ సీఐ ఇజాజొద్ధీన్ హెచ్చరించారు. జిల్లా ఎస్పీ జానకి ఆదేశాల మేరకు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా, ముందస్తు చర్యల్లో భాగంగా టూ టవున్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు ఆయన గురువారం కౌన్సిలింగ్ నిర్వహించారు. ఎన్నికల తరుణంలో ఎలాంటి అల్లర్లు, గొడవలు, సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ముందస్తు చర్యల్లో భాగంగా ప్రతి రౌడీ షీటర్ నుండి లక్ష రూపాయల విలువైన బాండ్ ను సంబంధింత అధికారుల ముందు బంధపత్రం తీసుకున్నామని, ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకే ఇలాంటి చర్యలు చేపట్టామని సీఐ ఇజాజొద్ధీన్ తెలిపారు.

Next Story