- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ నాయకుల సంబురాలు.. అసలు విషయం ఇదే!
దేశంలో ఏ రాష్టంలో లేని విధంగా తెలంగాణలో బిసిలకు రాజకీయాల్లో,ఉద్యోగ అవకాశాల్లో 42% రిజర్వేషన్ లు కల్పిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం పొందడం చారిత్రాత్మక నిర్ణయమని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

దిశ, నారాయణ పేట ప్రతినిధి: దేశంలో ఏ రాష్టంలో లేని విధంగా తెలంగాణలో బిసిలకు రాజకీయాల్లో,ఉద్యోగ అవకాశాల్లో 42% రిజర్వేషన్ లు కల్పిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం పొందడం చారిత్రాత్మక నిర్ణయమని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్బంగా జిల్లా కేంద్రలోని నర్సిరెడ్డి చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఎమ్మెల్యే డాక్టర్.చిట్టెం.పర్ణిక రెడ్డిల చిత్ర పటాలకు క్షిరాభిషేకం నిర్వహించారు. అనంతరం టపాకాయలు కాల్చి, మిఠాయలు పంచి సంబరాలు చేసుకున్నారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో కామారెడ్డిలో బిసి డిక్లరేషన్ సభలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశ వ్యాప్తంగా బిసికు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ప్రకటించడం జరిగిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో శాస్త్రీయ పద్దతి లో కులగణన సర్వే చేసి ఆ సర్వే ఆధారంగా బిసిలకు 42%రిజర్వేషన్ లు కల్పించుటకు అన్ని పార్టీలను ఒప్పించి అసెంబ్లీ లో బిల్లును పెట్టడంతో.. ఆమోదం పొందిందన్నారు. పేట మార్కెట్ చైర్మన్ శివారెడ్డి, సరాఫ్ నాగరాజు, కోణంగేరి హన్మంతు, కోట్ల మధుసూదన్ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ బోయ శరణప్ప, కాంత్ కుమార్ , లిఖి రఘు బాబు, మాజీ కౌన్సిలర్ మహేష్, రమేష్,ఆర్టీఏ బోర్డ్ సభ్యుడు పోషల్ రాజేష్,మహిమూద్ ఖురేషి, యూసుఫ్ తాజ్,వెంకు గౌడ్,కుర్వ మనోజ్ ,కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.






