గ్రామీణ స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించేందుకే ‘ సీఎం కప్’: ఎమ్మెల్యే ఆల

by Disha Web Desk 11 |
గ్రామీణ స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించేందుకే ‘ సీఎం కప్’: ఎమ్మెల్యే ఆల
X

దిశ, దేవరకద్ర: గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకే సీఎం కప్ 2023 క్రీడలను నిర్వహిస్తున్నామని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం మహబూబ్ నగర్ జిల్లా భూత్పుర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్రీడలను ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి , జిల్లా పరిషత్ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి లు ప్రారంభించారు. జాతీయ స్థాయిలో సత్తా చాటిన వెల్కి చర్ల కోత్తగొల్ల మహేశ్వరిని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అభినందించారు.

సీఎం కప్ నిర్వహణలో రాష్ట్రస్థాయిలో దేవరకద్ర నియోజకవర్గానికి చెందిన క్రీడాకారులు గెలుపొందితే తనవంతుగా రూ. 50,116 బహుమతిగా అందిస్తానని తెలిపారు. దేవరకద్ర నియోజకవర్గానికి చెందిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో ఎన్ని విభాగాల్లో గెలుపొందిన అన్ని విభాగాల వారికి ఒక్కక్కరికి రూ. 50,116 లను బహుమతిగా అందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ చెన్న కిష్ణన్న, దేవరకద్ర నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, బీ ఆర్ ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed