- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజ్యాధికారానికై బీసీ యువకులు చైతన్యం కావాలి : జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ముకుంద నాయులు
దిశ, పాన్ గల్ : తెలంగాణ రాష్ట్రంలో బీసీలను ఐక్యం చేసేందుకు బీసీ యువకులు గ్రామస్థాయి నుంచి చైతన్యం కావాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి ముకుంద నాయుడు పిలుపునిచ్చారు.

దిశ, పాన్ గల్ : తెలంగాణ రాష్ట్రంలో బీసీలను ఐక్యం చేసేందుకు బీసీ యువకులు గ్రామస్థాయి నుంచి చైతన్యం కావాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి ముకుంద నాయుడు పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో బీసీ సంఘం నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాన్‌గల్ మండల కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం పాన్‌గల్ మండల యువజన అధ్యక్షులుగా కె.సురేష్, మండల యువజన ఉపాధ్యక్షుడుగా బి. రాముడు ను నియమించినట్టు తెలిపారు. నూతనంగా ఎన్నికైన సభ్యులు మండల పరిధిలోని బీసీల సంక్షేమానికి అభివృద్ధికి కృషి చేయాలని ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో జరిగే భవిష్యత్ కార్యాచరణలో పాల్గొని బీసీల రిజర్వేషన్ల ప్రక్రియలో కీలకంగా పని చేస్తూ బీసీ ప్రజానీకాన్ని చైతన్యం చేయాలని కోరారు. బీసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనీ ఆ విధంగా ఆర్ కృష్ణయ్య ఎల్లపుడూ పనిచేస్తూ ఉంటారని అందరం కలిసి బీసీలను అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. సమావేశంలో బీసీ సంఘం ఉపాధ్యక్షులు చిట్యాల రాములు బీసీ నాయకులు మోహన్ యాదవ్, సురేష్ గౌడ్, వెంకటేష్, ముదిరాజ్ రాము, పవన్, విజయ్ కుమార్, భరత్, పార్థు, చింటు, శివ, వెంకటన్న తదితరులు పాల్గొన్నారు.






