రేవల్లిలో రాజకీయవర్గ పోరుతో పండుగవేళ‌ దాడులు- ప్రతిదాడులు

by Ratna Kumari |

మండల కేంద్రం రేవల్లిలో గత కొన్ని రోజులుగా కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీల నాయకుల వర్గాపోరుతో దాడులు ప్రతిగాడులతో గ్రామప్రజలు హడలిపోతూ సమిధలు అవుతున్నారు.

రేవల్లిలో రాజకీయవర్గ పోరుతో పండుగవేళ‌ దాడులు- ప్రతిదాడులు
X

దిశ‌, రేవ‌ల్లి : మండల కేంద్రం రేవల్లిలో గత కొన్ని రోజులుగా కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీల నాయకుల వర్గాపోరుతో దాడులు ప్రతిగాడులతో గ్రామప్రజలు హడలిపోతూ సమిధలు అవుతున్నారు. రేవల్లి గ్రామ ప్రజా ప్రతినిధుల కాలపరిమితి ముగియగానే ఈ రాజకీయ దాడులు ప్రతి దాడులకు తెరలేచింది ఎమ్మెల్యే వర్గీయులు వర్సెస్ మాజీ ఎమ్మెల్యే వర్గీయలుగా విడిపోయి ఈ దాడులను ప్రధానంగా గ్రామంలో ఎన్నికల లేదా పండుగ కోలాహలం సమయాలలో దాడులు చేసుకుంటున్నారు. ఈ సమయాలలో నచ్చచెప్పేందుకు ప్రయత్నం చేసే గ్రామస్తులపై కూడ దాడులకు తెగబడుతున్నారు. వీటిని అరికట్టాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడంతో వీటికి అడ్డు అదుపు లేకుండాపోయి గ్రామంలోని సాధారణ జనం పండుగలు పబ్బాలలో ప్రశాంతంగా ఉండాల్సిన సమయాలలో ఈ దాడుల్లో ప్రశాంతతను కోల్పోయి సమిధలవుతున్నారు. అందులో భాగంగా గురువారం రాత్రి పొద్దుపోయాక పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంగా ఉన్న వాలీబాల్ ఆటస్థలం దగ్గర చిన్న విషయం లో ప్రణాళిక ప్రకారం ఒక వర్గంపై మరో వర్గం మూకుమ్మడిగా దాడులకు తెగబడ్డారు దీంతో గ్రామ ప్రజలు చెల్లాచెదరయ్యారు.

రాత్రివేళ ఆటల పోటీలు ఏంటి ..?

సాధారణంగా సంక్రాంతి పర్వదినాన ప్రతిగ్రామంలోను బంధుమిత్రులతో ఉత్సాహంగా ఉండడానికై వివిధ రకాల ఆటల పోటీలను బండలాగుడు పోటీలను నిర్వహిస్తుంటారు. వాటిని సాయంత్రంలోపే ముగిస్తుంటారు. కానీ రేవల్లిలో అందుకు భిన్నంగా ఇలాంటి వాతావరణం లో గురువారం రాత్రి11గంటల వరకు నిర్వాహకులు ఆటల పోటీలను నిర్వహించి ఈ ఘర్షణకు, దాడులకు అవకాశం కల్పించగా ఆటల పోటీలకు స్థానిక పోలీసులు అనుమతులుఇచ్చి ప్రేక్షక పాత్ర పోషించారు. గ్రామంలో రాజకీయ ఆధిపత్య పోరులో భాగంగా దాడులు జరుగుతున్నాయని గతంలో స్థానిక పోలీస్ స్టేషన్లో ఇదే విషయమై పెద్ద రాజకీయ రాద్దాంతమే జరిగిన పోలీసులు రాత్రి వేళల్లో ఆటలో పోటీలకు అనుమతులు ఎలా ఇచ్చారని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. ప్రశాంతతకు నిలయాలుగా ఉండాల్సిన పల్లెలను దాడులను నిలయాలుగా మార్చే కుట్రలు కుతంత్రాలు పోలీసులు చేదించి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story