- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రి వాకిటి శ్రీహరి ఇంటి ముందు ఆశా వర్కర్లు ధర్నా
అసెంబ్లీ సమావేశాల్లో ఆశా వర్కర్లకు 18వేల ఫిక్స్ డ్ వేతనంగా నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మధ్యాహ్నం మంత్రి వాకిటి శ్రీహరి ఇంటి ముందు బైఠాయించి ధర్నా చేశారు.

దిశ, మక్తల్ : అసెంబ్లీ సమావేశాల్లో ఆశా వర్కర్లకు 18వేల ఫిక్స్ డ్ వేతనంగా నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మధ్యాహ్నం మంత్రి వాకిటి శ్రీహరి ఇంటి ముందు బైఠాయించి ధర్నా చేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వెంకట్రామ రెడ్డి నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి గోవిందరాజు, నాగరాజు, మహబూబ్ నగర్ జిల్లాలోని 24 సెక్టర్లు, వనపర్తి జిల్లా నుంచి రెండు మండలాలు మక్తల్ నియోజకవర్గంలోని ఐదు మండలాల సెక్టార్ల ఆశా వర్కర్లు సీఐటీయూ ఆధ్వర్యంలో మక్తల్ లోని ఆర్అండ్ బీ గెస్ట్ హౌస్ నుంచి మంత్రి వాకిటి శ్రీహరి ఇంటివరకు భారీ ర్యాలీగా వచ్చారు.
మంత్రి ఇంటికి ముందుకు వెళ్లకుండా 100 గజాల దూరంలో ఏర్పాటు చేసిన గేట్లను పోలీసులను తోసుకుంటూ మంత్రి ఇంటిని ఆశావర్కర్లు, ముట్టడించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆశాలపై చిన్నచూపు చూస్తుందన్న ఉద్దేశంతో ధర్నా చేస్తుంటే.. ఎన్నికల ముందు ఆశా వర్కర్లు ప్రవేశపెట్టిన 19 డిమాండ్లను నెరవేరుస్తామని.. హామీ ఇచ్చి రెండేళ్లు బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నా పాలక ప్రభుత్వం ఇచ్చిన హామీలను అసెంబ్లీ సమావేశంలో ప్రవేశపెట్టలేదన్నారు. ఆశావర్కర్లకు రూ.18వేలు చొప్పున పెంచితే.. రూ.100 కోట్లు కూడా కావన్నారు. ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదో అర్థం కావడం లేదన్నారు. సీఐటీయూ గౌరవ జిల్లా అధ్యక్షుడు వెంకట్రామ రెడ్డి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బలరాం, ఆశావర్కర్లు యూనియన్ అధ్యక్షురాలు బాలమణి, యూనియన్ జిల్లా కార్యదర్శి అనురాధ, సీఐటీయూ జిల్లా నాయకులు నరహరి పాల్గొన్నారు.






