ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని యువతి ఆత్మ‌హ‌త్య

by Nallavelli.Anjaneyulu |

ఇష్టం లేని పెళ్లి చేస్తున్నార‌ని యువ‌తి ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలోని చింత‌ల‌కుంట‌లో చోటు చేసుకుంది.

ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని యువతి ఆత్మ‌హ‌త్య
X

దిశ‌, కేటీ దొడ్డి : ఇష్టం లేని పెళ్లి చేస్తున్నార‌ని యువ‌తి ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలోని చింత‌ల‌కుంట‌లో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గత రెండు నెలల కింద కేటీదొడ్డి యువకుడితో పెళ్లి ఫిక్స్ అయింద‌ని.. కానీ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని పెళ్లి ఆపాలని కుటుంబ సభ్యులను గత పది రోజుల నుంచి వేడుకున్న కుటుంబ సభ్యులు పెళ్లి చేసుకోవాల్సిందే అని పట్టుబట్టడంతో ఇంటి దగ్గర ఎవ్వరు లేని సమయంలో ఉరి వేసుకోగా గమనించిన కుటుంబ సభ్యులు కర్ణాటక రాష్ట్రం లోని రాయచూరుకు హాస్పిటల్ కి తీసుకెళ్లగా డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఈ విషయం పై ఎస్సై శ్రీనివాస్ ను వివరణ కోరగా.. పూర్తి విచారణ చేసి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

Next Story