- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'దిశ' కథనానికి కొనసాగుతున్న ఎఫెక్టుల పరంపర
జిల్లాలో పార్కుల దుస్థితి పై 'పచ్చదనం పడకేసింది' అనే శీర్షికన బుధవారం 'దిశ' పత్రికలో వచ్చిన కథనానికి ఎఫెక్టుల పరంపర కొనసాగుతూనే ఉంది.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : జిల్లాలో పార్కుల దుస్థితి పై 'పచ్చదనం పడకేసింది' అనే శీర్షికన బుధవారం 'దిశ' పత్రికలో వచ్చిన కథనానికి ఎఫెక్టుల పరంపర కొనసాగుతూనే ఉంది. బుధవారం ఉదయమే మున్సిపల్ కార్పోరేషన్ కమీషనర్ రామానుజుల రెడ్డి శ్రీనివాసకాలనీలోని పెద్ద పార్కు ను, పట్టణంలోని వివిధ పార్కుల దుస్థితిని పరిశీలించి సీరియస్ అయ్యారు. గురువారం స్థానిక 45 వ డివిజన్ కార్పొరేటర్ సల్మాన్ షరీఫ్ తాను 'దిశ' కథనానికి స్పందించి తన డివిజన్లలో ఉన్న రెండు పార్కు లను శుభ్ర పరిచి, హైమాస్ట్ లైట్లు బిగించినట్లు తెలిపారు. తాజాగా ఆదివారం స్థానిక సంస్థల అదనపు ఇంచార్జీ కలెక్టర్ మధుసూదన్ నాయక్ స్థానిక శ్రీనివాస కాలనీ లోని పెద్ద పార్కును క్షుణ్ణంగా పరిశీలించి, కొన్ని మార్పులు చేర్పులను సూచిస్తూ తగు ఆదేశాలు జారీ చేశారు. నిత్యం పార్కు లను శుభ్రం చేయాలని, విరిగిపోయిన జిమ్ విభాగాలు, పిల్లల ఆట పరికరాలను వెంటనే మరమ్మత్తులు చేయించాలని ఆదేశించారు. తాను తరచుగా పార్కులను పరిశీలిస్తుంటానని శుచి శుభ్రత నిర్వాహణా పై రాజీ పడబోనని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఈ, ఏఈ లు ఉన్నారు.






