కల్వకుంట్ల కన్నారావుకు లుక్ అవుట్ నోటీసులు

by Disha Web Desk 2 |
కల్వకుంట్ల కన్నారావుకు లుక్ అవుట్ నోటీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్న కుమారుడైన కల్వకుంట్ల కన్నారావుకు పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల గ్రామంలో రెండు ఎకరాల భూమిని కబ్జా కేసులో కన్నారావుకు మంగళవారం నోటీసులు పంపించారు. ప్రస్తుతం కన్నారావు సింగపూర్‌లో తలదాచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పలువురి వద్ద డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మొత్తం భూ కబ్జాలో కీలక పాత్ర పోషించిన 38 మండి నిందితుల్లో 10 మందిని అరెస్ట్ చేశారు. మరోవైపు భూ కబ్జా, హత్యాయత్నం ఆరోపణలతో తనపై ఆదిభట్ల పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులను కొట్టివేయాలంటూ కన్నారావును హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసిన విషయం తెలిసిందే.


Next Story

Most Viewed