- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పెళ్లికి ముందే గుడ్ న్యూస్ చెప్పేసిన బిగ్‌బాస్ ప్రియాంక-శివ.. ఫైనల్‌గా జరిగిపోయిందంటూ వీడియో
దిశ, సినిమా: బుల్లితెర నటి ప్రియాంక జైన్ మౌనరాగం సీరియల్ ద్వారా పరిచయం అయి బిగ్‌బాస్ తర్వాత ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. అయితే ఈ అమ్మడు గత కొద్ది కాలంగా బుల్లితెర సీరియల్ హీరో శివ కుమార్‌తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఇక వీరిద్దరూ ఒకే ఇంట్లో ఉంటూ.. ఓ యూట్యూబ్ చానల్ కూడా పెట్టారు. అందులో పలు వ్లాగ్స్ షేర్ చేస్తూ నెట్టింట తెగ రచ్చ చేస్తుంటారు. అయితే ప్రియాంక, శివ కుమార్ ఓ టీవీ షోలో పెళ్లి కూడా చేసుకుని అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. అంతేకాకుండా ఈ షోకు ఇరు కుటుంబ సభ్యులు రావడంతో అంతా నిజమైన పెళ్లి అని అనుకున్నారు. కానీ అదంతా స్క్రిప్ట్ అని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. ప్రియాంక-శివ వరుసగా గుడ్ న్యూస్‌లు చెబుతూ ఫ్యాన్స్‌ను అయోమయంలో పడేస్తున్నారు. ఇటీవల తాము ఓ ఫ్లాట్ కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. కానీ తామే దగ్గరుండి ఇల్లు కట్టించుకోవాలని నిర్ణయించుకుని కొనడం ఆపేశారు. తాజాగా, ఈ జంట మరో గుడ్ న్యూస్ చెబుతూ ఓ వీడియోను షేర్ చేశారు. హైదరాబాద్‌లో ఓ ఖాళీ స్థలాన్ని కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. అందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పనులు కూడా పూర్తి అయ్యాయని తమకు నచ్చిన ఏరియాలో స్థలం కొనడం సంతోషంగా ఉందని తెలిపారు. దీంతో ఈ విషయం తెలిసిన వారంతా కంగ్రాట్స్ చెబుతున్నారు.