నంబాల ఎన్‌కౌంటర్‌పై అనేక సందేహాలు.. విచారణ జరిపించాలి: సీపీఐ కూనంనేని డిమాండ్

by Ramesh Naini |   (  Updated:2025-05-22 11:25:21  IST  )

ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు పలువురు మావోయిస్టుల ఎన్ కౌంటర్‌లపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

నంబాల ఎన్‌కౌంటర్‌పై అనేక సందేహాలు.. విచారణ జరిపించాలి: సీపీఐ కూనంనేని డిమాండ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: నిన్న (Chhattisgarh encounter) ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు (Nambala Kesava Rao) పలువురు మావోయిస్టుల ఎన్ కౌంటర్‌లపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒక వేళ కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోతే సుప్రీంకోర్టు (Supreme Court) ఈ కేసును సుమోటోగా స్వీకరించి న్యాయ విచారణకు ఆదేశించాలని తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నంబాల ఎన్ కౌంటర్ పై అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయని, ఈ వయసులో అడవిలో ఉన్నారా? లేదా తీసుకెళ్లి అక్కడ మట్టుపెట్టారా? అనే కథనాలు వస్తున్నాయని ఆరోపించారు. దీంతోపాటు గత కొంతకాలంగా జరుగుతున్న మావోయిస్టుల, ఆదివాసీల ఎన్ కౌంటర్ల పై కూడా విచారణలో చేర్చాలని, ఆపరేషన్ కగార్ మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన విచారణ అంశంలో చేర్చాలని కోరారు.

నిన్నటి ఘటనపై ప్రధాని మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా శత్రుదేశంపై విజయం సాధించిన రీతిలో స్పందించడం విచారకరమని పేర్కొన్నారు. స్థానిక ప్రజల హక్కులు, వనరుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్న వారిని ఏకపక్షంగా ఎన్ కౌంటర్ చేయడం సమంజసం కాదన్నారు. ఇది శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యగా చూడాలని తెలిపారు. 2026 మార్చి 31 వరకు నక్సలైట్లను అంతం చేస్తామని లక్ష్యంగా పెట్టుకుని మరి ఎన్కౌంటర్లు చేస్తుండడం, మరోపక్క తాము శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టులు ప్రకటిస్తున్నప్పటికీ పట్టించుకోకపోవడం ద్వారా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఎన్ కౌంటర్లకు పాల్పడుతున్న విషయం స్పష్టమవుతుందని ఆరోపించారు. ఇది ప్రజాస్వామిక హక్కులకు విఘాతం కలిగించే అంశమని, వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని సుప్రీంకోర్టు న్యాయ విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని కూనంనేని పేర్కొన్నారు.

Also Read: నరమేధం ఆపండి.. నంబాల కేశవరావు ఎన్కౌంటర్‌ను ఖండించిన ఎమ్మెల్సీ కోదండరాం

Next Story