- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉగ్రదాడిపై కేటీఆర్ షాకింగ్ ట్వీట్
జమ్మూ కాశ్మీర్ ( Jammu and Kashmir)పర్యటకుల మీద... జరిగిన ఉగ్రదాడి పైన ( terrorist attack) గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసి

దిశ, వెబ్ డెస్క్ : జమ్మూ కాశ్మీర్ ( Jammu and Kashmir)పర్యటకుల మీద... జరిగిన ఉగ్రదాడి పైన ( terrorist attack) గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ( KTR ) స్పందించారు. ఈ ఉగ్రదాడిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కేటీఆర్. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో ( Pahalgam terror attack ) జరిగిన ఉగ్రదాడిలో 27 మంది పర్యాటకులు చనిపోవడం పట్ల.. తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్.
పర్యాటకుల ( pilgrims) ప్రాణాలు తీయడం హేయమైన చర్య అంటూ ఫైర్ అయ్యారు. ఆ పాశవిక దాడిలో... మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు కల్వకుంట్ల తారక రామారావు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని... ఆ ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ దారుణమైన సంఘటనలో ఆస్తులను కోల్పోయిన వారికి కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలిచి ఆర్థిక సహాయం చేయాలని కూడా కోరారు కేటీఆర్. కశ్మీర్ లో ఉగ్ర మూకలకు స్థానం లేదన్న సందేశాన్ని బలంగా ఇవ్వాలని కూడా మోడీ ప్రభుత్వాన్ని కోరారు.
Deeply saddened and anguished by the tragic loss of lives in the horrific terrorist attack in Pahalgam, Jammu & Kashmir.
— KTR (@KTRBRS) April 22, 2025
My heartfelt condolences to the families of the tourists who lost their lives.
I strongly condemn this cowardly act of violence and urge the Government of…






