- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేటీఆర్, కిషన్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్.. ఏం చేశారో తెలుసా?: CM రేవంత్
జూబ్లీహిల్స్(Jubilee Hills) ఓటర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక సూచనలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్(Jubilee Hills) ఓటర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక సూచనలు చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి.. గత రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వ(Congress Govt) హయాంలో తాము చేసిన అభివృద్ధి చూసి ఓటేయాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అక్షరాల రూ.8 లక్షల కోట్ల అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మార్చారని అన్నారు. రూ.16 వేల మిగులు బడ్జెట్లో ఉన్న తెలంగాణను ఈ దుస్థితికి తెచ్చారని అన్నారు. అప్పులకు వడ్డీలు కడుతూనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో ఆ తర్వాత టీడీపీ హయాంలో ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ హయాంలో రాష్ట్రం అభివృద్ధి చెందింది తప్ప.. గత పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి శూన్యమన్నారు.
మెట్రో రైలు, ఔటర్ రింగ్ రోడ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇలా చెప్పుకుంటూ పోతే.. హైదరాబాద్‌కు అంతర్జాతీయ గుర్తింపు రావడానికి కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలే అని చెప్పారు. బీఆర్ఎస్తో పాటు బీజేపీతో కూడా తెలంగాణకు ఒరిగిందేమీ లేదని అన్నారు. కాళేశ్వరం కట్టి రూ.లక్ష కోట్లు గంగలో కలిపారని అన్నారు. కేటీఆర్ రాజకీయ భవిష్యత్ బాగుండాలనే రాష్ట్రంలో కొత్త సచివాలయం కట్టారు? తప్ప.. రాష్ట్రం కోసం కాదని.. ఈ కొత్త సచివాలయం కట్టాల్సిన అర్జెన్స్ ఏముండే అని అన్నారు. ప్రతిపక్షాలపై నిఘా పెట్టేందుకే కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మించారని విమర్శించారు. పదేళ్లలో తెలంగాణకు ఏం తెచ్చారో కిషన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. వరదలు వచ్చి నగరం మొత్తం అతలాకుతలం అయినా కూడా కేంద్రం నుంచి కిషన్ రెడ్డి ఒక్క రూపాయి కూడా తేలేదని అన్నారు.
ఫూచర్ సిటీని, మెట్రో విస్తరణను, ఎలివేటెడ్ కారిడార్‌ను కుట్రపూరితంగా బ్యాడ్ బ్రదర్స్ అయిన కేటీఆర్, కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. వీరిద్దరిని హైదరాబాద్ ప్రజలు బ్యాడ్ బ్రదర్స్‌లాగే పరిగణిస్తున్నారని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చామని వెల్లడించారు. రాష్ట్రాన్ని కొళ్లగొట్టి కేసీఆర్ కుటుంబం వేల కోట్లు సంపాదించింది.. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు అక్రమ సంపాదనతో ఫామ్‌హౌజ్‌లు నిర్మించుకున్నారని ఆరోపించారు. నిరుద్యోగులను కూడా పదేళ్ల పాటు ఎంతో ఇబ్బంది పెట్టారని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఏడాదిలోనే 70 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. ఉద్యోగాల మీద కూడా తప్పుడు ప్రచారం చేస్తారని.. బహిరంగంగా ఎల్బీ స్టేడియంలో ఇచ్చామని అన్నారు. కేసీఆర్ తెలంగాణకు చేసింది ఒక్కటే.. తెలంగాణలో డ్రగ్స్, గంజాయి కల్చర్ పెంచడం అన్నారు. కంటోన్మెంట్లో రూ.5 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేశాం.. రేపు జూబ్లీహిల్స్‌లో కూడా అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టబోతున్నామని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్, బీజేపీలు రెండూ కలిసి కుట్రపూరితంగా అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి కాబట్టే.. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను గెలిపించాలని బలంగా కోరుతున్నాని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేటీఆర్ అనే ఒక విషపురుగుకు కిషన్ రెడ్డి ఎందుకు లొంగిపోయాడో తెలియడం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు.






