KTR: పాలన చేతగాక మిస్టరీ మరణాలపై ఇతరుల పేర్లా? సీఎంకు కేటీఆర్ కౌంటర్

by Prasad Jukanti |

సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ లో చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.

KTR: పాలన చేతగాక మిస్టరీ మరణాలపై ఇతరుల పేర్లా? సీఎంకు కేటీఆర్ కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రేవంత్ రెడ్డికి (Revanth Reddy) పరిపాలన చేతకాకనే రాష్ట్రంలో జరుగుతున్న మరణాలపైన (Mystery Deaths) ఇతరుల పేరును ప్రస్తావిస్తున్నారని బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఛీఫ్ మినిస్టర్ గా మాట్లాడాలి కానీ ఒక చీప్ మినిస్టర్ గా మాట్లాడవద్దని రేవంత్ రెడ్డికి సూచిస్తున్నానన్నారు. అధికారంలో తామే ఉన్నామన్నది మరిచిపోయి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మిస్టీరియస్ మరణాలపై కావాల్సిన విచారణలు, దర్యాప్తులు చేసుకోవచ్చన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో చేసిన మీడియాతో చిట్ చాట్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏఎన్ఐ తో మాట్లాడుతూ స్పందించారు. దేవుడిచ్చిన ముఖ్యమంత్రి అవకాశాన్ని వాడుకొని ప్రజలకు మంచి చేయాల్సింది పోయి రాజకీయాలకు పాల్పడుతున్నారని, కేవలం టైంపాస్ చేసేందుకు పరిపాలనను పక్కనపెట్టి చేతకాకనే ఇవన్నీ మాట్లాడుతున్నారన్నారని ఆగ్రంహం వర్యక్తం చేశారు.

రేవంత్ ధనదాహానికి ఎస్ఎల్ బీసీ ప్రమాదం:

ఎస్ఎల్ బీసీ టన్నెల్ (SLBC) ప్రమాదంపైన రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ మండిపడ్డారు. ఈ అంశంపై ఏఎన్ఐతో మాట్లాడిన కేటీఆర్.. తన అసమర్ధతను పాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం పైన నెపం నెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా రేవంత్ రెడ్డి వ్యవహారం ఉందన్నారు. జిఎస్ఐ, ఇంజనీరింగ్ నిపుణులు వంటి సంస్థలతో సంప్రదించకుండానే ఆగిపోయిన ప్రాజెక్టుని ప్రారంభించారని అవినీతి సొమ్ముల కోసం లాలూచి పడి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా పాత యంత్రాలతో ప్రారంభించారని ఆరోపించారు. కేవలం రేవంత్ రెడ్డి ధన దాహం వల్లనే ఈరోజు 8 మంది కార్మికులు ప్రమాదంలో చిక్కుకున్నారని ధ్వజమెత్తారు. వారు బతికున్నారో లేదో అనే ఆందోళనకరమైన పరిస్థితి నెలకొని ఉంది దీనికి పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి వహించాలన్నారు. రేవంత్ రెడ్డి కార్మికులను రక్షించాల్సింది పోయి బ్లేమ్ గేమ్ ప్రారంభించారని దుయ్యబట్టారు.

దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు:

అరచేతిలో స్వర్గం చూపించేలా ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతకాకనే ప్రజల టెన్షన్ డైవర్షన్ కోసం ముఖ్యమంత్రి ఇవన్నీ మాట్లాడుతున్నారు. 15 నెలల నుంచి కేవలం ప్రజల అటెన్షన్ డైవర్షన్ పేరుతో ఆటలాడుతున్న రేవంత్ రెడ్డి పాలనను పక్కనపెట్టారు. రేవంత్ రెడ్డి అన్ని విషయాల్లో అబద్ధాలు ఆడుతున్నారు. ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చింది కాబట్టి తెలంగాణకు మంచి జరిగేలా ప్రజలకు మంచి జరిగేలా వ్యవహరించాలని సూచిస్తున్నానన్నారు. రాష్ట్ర అప్పుల విషయంలో కూడా అబద్ధాలు ఆడుతున్నారు 6500 కోట్లు కేవలం వడ్డీ లెక్క అయిపోతుందంటూ రాష్ట్ర ప్రజలను, దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డికి ఆర్థిక వ్యవస్థ గురించి అవగాహన లేదని విమర్శించారు.

Next Story