కేసీఆర్ క్యారెక్టర్ పై కేకే సంచలన వ్యాఖ్యలు.. ‘ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మూడో స్థానమే’

by Disha Web Desk 13 |
కేసీఆర్ క్యారెక్టర్ పై కేకే సంచలన వ్యాఖ్యలు.. ‘ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మూడో స్థానమే’
X

దిశ, డైనమిక్ బ్యూరో:రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్, బీజేపీకే ఎక్కువ సీట్లు వస్తాయని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ, రాజ్యసభ సభ్యుడు కేకే సంచలన వ్యాఖ్యలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైనందునా ఎంపీ ఎన్నికల్లో గట్టి ప్రయత్నం చేయాల్సి ఉందని అన్నారు. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య ఎంపీ ఎన్నికల పోటీ ఉండబోతున్నదని కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వూలో మాట్లాడిన ఆయన తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మొన్న ఒడిపోయాం కాబట్టి ఈసారి మా పార్టీకి అంత బలం లేదని, బీఆర్ఎస్ మూడో స్థానానికే పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. మాకంటే ముందు వరుసలో కాంగ్రెస్, బీజేపీలు ఉంటాయన్నారు. అయితే ఫస్ట్, సెకండ్ ఫ్లేస్ లో ఎవరు ఉంటారనేది చెప్పడం కష్టం అన్న కేకే.. ఈ ఎన్నికల్లో క్యాండిటేడ్ ప్రయార్టీ కాబోతున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి పాలన పట్ల ప్రజల్లో ఆనందం వ్యక్తం అవుతున్నదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత కనిపంచలేదన్నారు. అలాగే మోడీ ఓటు వేస్తామని కూడా ప్రజలు చెబుతున్నారన్నారు. కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న కేకే బీఆర్ఎస్ మూడో స్థానంలో ఉండబోతున్నదని ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

నా మాటలు పట్టించుకోలే:

తానిచ్చిన ఇన్ పుట్స్ ను కేసీఆర్ సీరియస్ గా తీసుకోలేదని, బీఆర్ఎస్ కుటుంబ పార్టీగా మారిందనేది నిజమే అన్నారు. ప్రభుత్వంలో, బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో కేసీఆర్ తర్వాత కేటీఆర్, హరీశ్ రావు, కవిత మాత్రమే కనిపిచారని మిగతా నాయకులు కనిపించలేదన్నారు. పార్టీ మారిన లీడర్లను ప్రజలు చెప్పుతో కొట్టాలన్న పిలుపును ఎవరు కేర్ చేయరన్నారు. ఎవరైనా పార్టీ మారాలనుకునే వారు తమ పదవులకు రాజీనామా చేయడం నైతికంగా, రాజకీయ బాధ్యత అన్నారు. గతంలో ఈ విషయంలో బీఆర్ఎస్ తప్పు చేసిందని తాను ఓపెన్ గానే చెప్పానన్నారు. ప్రస్తుత రాజకీయకులు మాట్లాడుతున్న నీచమైన గత 60 ఏళ్లలో ఎప్పుడూ వినలేదు అన్నారు. బీఆర్ఎస్ వచ్చిన తర్వాతే వింటున్నాన్నారు. మీరందరు అనుకున్నట్లుగా నా దృష్టిలో కేసీఆర్ అవినీతి పరుడు కాదని తన జేబులో ఏదైనా ఉంటే దానిని తన స్నేహితుడికి ఇచ్చే క్యారెక్టర్ కేసీఆర్ దన్నారు. ఏ ప్రభుత్వం అయినా అవినీతికి పాల్పడితే తప్పకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గత ప్రభుత్వ అవినీతిలో కేసీఆర్ కుటంబ సభ్యులు ఉంటే ఉండవచ్చు ఆ విషయం నాకు తెలియదన్నారు. కాళేశ్వరం విషయంలో కేసీఆర్ అన్ నెససరీ డిజైన్ ఇచ్చారు. ఆ పని నిపుణులు చేయాల్సిందన్నారు. తనను దీపాదాస్ మున్షీ కవడం సాధారణ విషయమే అని.. పార్టీ మారాలనుకున్న నా కూతురు నిర్ణయం నాకెలా తెలుస్తుందన్నారు.


Next Story

Most Viewed