దేశంలో ప్రాథమిక ఆరోగ్యానికి చర్యలేవి.. కేంద్రాన్ని ప్రశ్నించిన టీఆర్ఎస్ నేత

by Web Desk |
దేశంలో ప్రాథమిక ఆరోగ్యానికి చర్యలేవి.. కేంద్రాన్ని ప్రశ్నించిన టీఆర్ఎస్ నేత
X

దిశ ప్రతినిధి, ఖమ్మం: క‌రోనా మ‌హ‌మ్మారి యావ‌త్ దేశాన్ని అతలాకుత‌లం చేస్తున్న త‌రుణంలో సుస్థిర‌ ప్రాథ‌మిక ఆరోగ్యానికి(ప్రైమ‌రి హెల్త్‌) కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చ‌ర్యలేమిట‌ని టీఆర్ఎస్ లోక్‌స‌భ ప‌క్ష నేత నామా నాగేశ్వర్‌రావు కేంద్రాన్ని ప్రశ్నించారు. యూనివర్సల్ హెల్త్ కవరేజ్, ఆరోగ్య సంబంధిత సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి దేశ స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ)లో కనీసం ఒక శాతాన్ని ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ(పీహెచ్సీ)కి కేటాయించాల‌ని ప్రపంచ ఆరోగ్య సంస్థ‌(డ‌బ్ల్యూహెచ్ఓ) ప్రభుత్వానికి సూచించిన విష‌యాన్ని ఆయన లోక్‌స‌భ‌లో ప్రస్తావించారు.

ఎంపీ నామా ప్రశ్నకు డా. భారతి ప్రవీణ్ పవార్ లిఖిత‌పూర్వకంగా సమాధానిమిస్తూ 2017-18 జాతీయ ఆరోగ్య ఖాతాల(ఎన్‌హెచ్ఏ) అంచనాల ప్రకారం, ఆరోగ్యానికి కేటాయించిన ప్రభుత్వ వ్యయం జీడీపీలో ఒక శాతంకు ఎక్కువ ఉన్నద‌ని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ కింద, పబ్లిక్ హెల్త్‌కేర్ డెలివరీని బలోపేతం చేయడానికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సాంకేతిక, ఆర్థిక సహాయం అందింస్తున్నామని పేర్కొన్నారు. యూనివర్సల్ హెల్త్ కవరేజీని క్రమంగా సాధించడానికి, సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడానికి 2018లో ఆయుష్మాన్ భారత్, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ప్రారంభించిన‌ట్టు గుర్తు చేశారు.



Next Story

Most Viewed