5న సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణోత్సవం

by Disha Web Desk 1 |
5న సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణోత్సవం
X

దిశ, వైరా: వైరా రిజర్వాయర్ అలుగుల వద్ద పురాతన దాసాంజనేయ స్వామి ఆలయంలో 5న శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించన్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు చావా శ్రీనివాసరావు, కార్య నిర్వాహకులు చింతనిప్పు వెంకటేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. మాగ పౌర్ణమి సందర్భంగా ముందుగా స్వామి వారికి పంచామృతాభిషేకాలు, అష్టోత్తర పూజ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం కళ్యాణ క్రతువు ప్రారంభమవుతోందని వారు తెలపారు. అదేవిధంగా హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని నిర్వహించి అన్నదానం చేస్తామని తెలిపారు. వైరా స్విమ్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇప్పటికే సుమారు రూ.5 లక్షల రూపాయల విరాళాలతో ఆలయాన్ని అభివృద్ధి చేశారు. కళ్యాణోత్సవానికి మండల పరిధిలోని వివిధ గ్రామాల ప్రజలు హాజరై స్వామి వారి ఆశీస్సులు పొందాలని కోరారు.


Next Story

Most Viewed