Godavari : భద్రాద్రి వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ

by Sridhar Babu |

గోదావరి తగ్గుముఖం పట్టడంతో కలెక్టర్ జితేష్ వి పాటిల్ రెండవ ప్రమాద హెచ్చరిక ఉపసంహరించినట్లు పేర్కొన్నారు.

Godavari : భద్రాద్రి వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ
X

దిశ, భద్రాచలం : గోదావరి తగ్గుముఖం పట్టడంతో కలెక్టర్ జితేష్ వి పాటిల్ రెండవ ప్రమాద హెచ్చరిక ఉపసంహరించినట్లు పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం 2.04 గంటలకు గోదావరి 48 అడుగులకు చేరుకోవడంతో రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తర్వాత క్రమేపి పెరుగుతూ, మంగళవారం ఉదయం 8 గంటలకు 51.60 అడుగులకు పెరిగిన గోదావరి 11 గంటల నుండి తగ్గుముఖం పట్టింది.

బుధవారం తెల్లవారుజాము 3.51 గంటలకు 47.9 అడుగులకు తగ్గడంతో రెండవ ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. బుధవారం సాయంత్రం 7 గంటలకు 45.2 అడుగుల మేర గోదావరి నిలకడగా ప్రవహిస్తుంది.బుధవారం తెల్లవారు జాము 3.51 గంటల నుండి, సాయంత్రం 7 గంటలు వరకు దాదాపు 15 గంటలలో కేవలం 2.7 అడుగులు తగ్గింది. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. 43 అడుగులకు తగ్గి ప్రవహిస్తే మొదటి ప్రమాద హెచ్చరిక కూడా ఉపసంహరిస్తారు. ఎగువనున్న పేరూరు వద్ద గోదావరికి వరద ఉధృతి పెరగడంతో గోదావరి మళ్లీ కొద్దిగా పెరగవచ్చని తెలుస్తుంది.

Next Story