ఆ గ్రామాల ప్రజలకు గుడ్‌న్యూస్.. రూరల్‌ మండలంలో కలుపుతూ గెజిట్ విడుదల

by Disha Web Desk 13 |
ఆ గ్రామాల ప్రజలకు గుడ్‌న్యూస్.. రూరల్‌ మండలంలో కలుపుతూ గెజిట్ విడుదల
X

దిశ, ఖమ్మం: రూరల్ ​మండలం లో అంతర్భాగమైన కామంచికల్లు, దారేడు రెవెన్యూ గ్రామాలు 2018లో రఘునాథపాలెం మండలం లో కలుపుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. కానీ, అప్పటి నుంచి మండలం వేరైన నియోజకవర్గం మాత్రం పాలేరు నియోజకవర్గం ఉండటంతో పాలనపరమైన ఇబ్బందులు తప్పడం లేదు. 2018 సాధారణ ఎన్నికల అనంతరం ఎమ్మెల్యే కందాల ఉపేందర్​రెడ్డి దృష్టికి రూరల్​మండలం నుంచి రఘనాథపాలెం మండలం లో కలపడం వలన కలుగుతున్న ఇబ్బందులను గ్రామాలకు చెందిన నాయకులు విన్నవించడంతో స్పందించిన ఎమ్మెల్యే కందాల సీఎం కేసీఆర్‌ను ఒప్పించడంతో పాటు శాసనసభలో కూడా విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. మరల ఆ రెండు గ్రామాలను రూరల్‌లో కలిపేందుకు విశేష కృషి చేశాడని చెప్పాలి. రూరల్​ మండలం లో కలవడం వలన రెండు గ్రామాలకు రెవెన్యూ పరమైన ఇబ్బందులు తప్పడం తో పాటు నియోజకవర్గం, పోలీస్​స్టేషన్​తదితర సమస్యలకు కూడా పరిష్కారం లభించినట్లందని చెప్పాలి. ఇందకు విశేష కృషి చేసిన ఎమ్మెల్యే కందాల ఉపేందర్​రెడ్డికి కామంచికల్లు టీఆర్‌ఎస్​నాయకలు రఘు, లింగయ్య, దారేడు ఎంపీటీసీ కళింగ రెడ్డి, బోజ్యానాయక్ ​తదితరులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

ఎమ్మెల్యే కందాల కృషితోనే.. బెల్లం ఉమ (ఖమ్మం రూరల్​ ఎంపీపీ)

రఘునాథపాలెం మండలం లో కలిసిన కామంచికల్లు, దారేడు రెవెన్యూ గ్రామాలను తిరిగి రూరల్​లోకి కలపడంలో పాలేరు ఎమ్మెల్యే కందాల పాత్ర విశేషమైందని చెప్పాలి. చెప్పిన మాట తప్పకుండా చేయడమే నాయకత్వ లక్షణం అని ఆమె అన్నారు. ఈ ప్రాంత ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలిపారు.

Next Story

Most Viewed