రూ.10లక్షల గంజాయి స్వాధీనం

by Disha Web Desk 1 |
రూ.10లక్షల గంజాయి స్వాధీనం
X

దిశ, కుత్భుల్లాపూర్: బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిని బాచుపల్లి పోలీసులు అదుపులోకి తీసుకొని రూ.10 లక్షల విలువైన 41కిలోల గంజాయి, కారు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. బాలానగర్ డీసీపీ శ్రీనివాస్ రావు తెలిపిన వివరాల ప్రకారం కుత్భుల్లాపూర్ చింతల్ కు చెందిన శివరాత్రి నరేందర్ (29) అనే యువకుడు ట్రేడింగ్ బిజినెస్ చేసి భారీగా నష్టపోయాడు. తనకు అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి చేయడంతో అప్పు తీర్చేందుకు సులువైన మార్గం వెతుకుతున్న సమయంలో వైజాగ్ కు చెందిన రాజేశ్ తో పరిచయమయ్యాడు. రూ.2.20లక్షలతో 50కిలోల గంజాయి సప్లై చేస్తే అప్పులు తీరుతాయని సలహాలివ్వడంతో గంజాయి కొనుగోలు చేశాడు. రాజేశ్ చెప్పినట్లుగా ఆదివారం సాయంత్రం మూసాపేట్ వద్ద తన మనిషి గంజాయితో వస్తాడని, అది తీసుకోవల్సిందిగా చెప్పడంతో కియా కారును అద్దెకు తీసుకొని నరేందర్ మూసపేటకు వెళ్లి కారులో గంజాయి లోడ్ చేసుకొని మియాపూర్ అవతల నుంచి తిరిగి వస్తుండగా బాచుపల్లి పోలీసులు విశ్వాసనీయ సమాచారం మేరకు అడ్డుకున్నారు.ఈ క్రమంలో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు యత్నించిన నరేందర్ ను బాచుపల్లి ఇన్ స్పెక్టర్ కె.నర్సింహారెడ్డి, ఎస్ఐ సాయినాథ్ టీమ్ తో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి రూ.10లక్షల విలువైన 41 కేజీల గంజాయి, కియా కారు, సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు.ఈజీ మనీ కోసం గంజాయి స్మగ్లింగ్ చేయడానికి పూనుకొని కటకటాల పాలయ్యాడని డీసీపీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి ఏసీపీ చంద్రశేఖర్, జగద్గిరిగుట్ట సీఐ సైదులు, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed