పేదింటి ఆడపడుచులకు కళ్యాణలక్ష్మి ఒక వరం : ఎమ్మెల్యే వనమా

by Disha Web Desk 15 |
పేదింటి ఆడపడుచులకు కళ్యాణలక్ష్మి ఒక వరం : ఎమ్మెల్యే వనమా
X

దిశ ప్రతినిధి,కొత్తగూడెం : పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి ఒక వరమని కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు అన్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీ 36 వార్డుల్లో 79 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెదింటి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఒక వరం అని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు పేద మధ్య తరగతి ప్రజలకు ఆర్థిక ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్తగూడెం నియోజకవర్గం అభివృద్ధి చెందడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో సహకరించారని అన్నారు. ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతామాలక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, ఎమ్మార్వో శర్మ, మున్సిపల్ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రెవెన్యూ సిబ్బంది, లబ్ధిదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


Next Story

Most Viewed