నిఘా నీడలో ప్రభుత్వ ఆసుపత్రులు

by Dishanational1 |
నిఘా నీడలో ప్రభుత్వ ఆసుపత్రులు
X

దిశ, కల్లూరు: కల్లూరు మండల పరిధిలోని కల్లూరు, చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నిఘానేత్రంలో ప్రభుత్వాసుపత్రులు కొనసాగుతున్నాయి. గత కొద్ది రోజుల క్రితం నుంచి రాష్ట్ర ప్రభుత్వం కల్లూరు, చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా పని తీరు సమయపాలన సిబ్బంది హాజరు.. రోగులు రాకపోకలు, మెనూ రోగులకు అందే విధానం.. ఆన్ లైన్ లో సీసీ కెమెరాలు అనుసంధానం వలన ఉన్నతాధికారులు రాష్ట్రస్థాయిలో పరిశీలిస్తారు. సిబ్బంది పనితీరు మెరుగుపరిచేందుకు ప్రజలకు అందుతున్న సేవలను అనునిత్యం సీసీ కెమెరా నిఘాలో రికార్డు చేయనున్నారు. కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమికోన్నత ఆసుపత్రి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, హోమియో వైద్యశాల.. దీనిలో మొత్తం మూడు ఆసుపత్రులు అనుసంధానంగా ఉండటం వల్ల ఫీల్డ్ స్టాప్ తో కలిపి 100 మంది ప్రజలకు సేవలను అందిస్తున్నారు. పర్యవేక్షణ మొత్తం నిఘానేత్రమే చేస్తుంది. దీని వలన లోటుపాట్లు, పనితీరు, హాజరు, గైర్హాజరు రోగులకుమెనూ అందే విధానం, సిబ్బంది రాకపోకలు, హాస్పటల్లో పనితీరు అనుక్షణం ప్రతిక్షణం సీసీ కెమెరాలు పరిశీలిస్తాయని.. వీటి పరిశీలన ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ ఉన్నత స్థాయి కార్యాలయాలలో పరిశీలన ఉంటుందని వైద్యులు తెలిపారు.





Next Story

Most Viewed