ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

by Jakkula.Mamatha |

మండల కేంద్రంలోని భట్టుపల్లి, కరకగూడెం సొసైటీ, జీసీసీ ద్వారా నిర్వహిస్తున్న వారి ధాన్యం కేంద్రాలను గురువారం జిల్లా కలెక్టర్ అంకిత్ తనిఖీ చేశారు.

ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
X

దిశ, కరకగూడెం: మండల కేంద్రంలోని భట్టుపల్లి, కరకగూడెం సొసైటీ, జీసీసీ ద్వారా నిర్వహిస్తున్న వారి ధాన్యం కేంద్రాలను గురువారం జిల్లా కలెక్టర్ అంకిత్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ధాన్యం ఆరబోసిన రైతులతో మాట్లాడారు. అక్కడ నిల్వ ఉన్న ధాన్యాన్ని పరిశీలించి తేమశాతం గుర్తించే మీటర్ ద్వారా తనిఖీ చేశారు. ధాన్యం నాణ్యత ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ, పురోగతి, పెండింగ్ ధాన్యం వివరాలు తెలుసుకుని సన్న, దొడ్డు రకం ధాన్యం కొనుగోలుకు వేర్వేరుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సదుపాయాలను సమకూర్చాలని సంబంధిత అధికారులకు సూచించారు.

ప్రభుత్వ ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ చేసిన

రోగులకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి వైద్య సేవలు అందిచాలని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. కలెక్టర్ ఆస్పత్రిలోని అన్ని విభాగలను పరిశీలించి వైద్యులతో మాట్లాడారు. వైద్య సిబ్బంది గ్రామాల్లో నిరంతరం పర్యటించి ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, మండల ప్రత్యేక అధికారి దినేష్ కుమార్, వ్యవసాయ డివిజనల్ అధికారి తాతరావు, ఏఓ చాటర్జీ, తహసీల్దార్ కాంతయ్య, ఎంపీడీఓ దేవా వర కుమార్, ప్రభుత్వ వైద్యాధికారి రవితేజ, ఆర్ఐ కృష్ణ ప్రసాద్, ఎంఈఓ గడ్డం మంజుల, సహకార సంఘం వెంకటేశ్వర్లు, నీటిపారుదల శాఖ ఏఈ సక్రు, కార్యదర్శులు, సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story