బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటే

by Disha Web Desk 15 |
బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటే
X

దిశ,తిరుమలాయపాలెం : బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రెండూ ఒక్కటే అని, లోపాయి కారి ఒప్పందంతో రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రామ సహాయం రామిరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ గురువారం తిరుమలాయపాలెం మండలంలోని దమ్మాయిగూడెం గ్రామంలో నిర్వహించిన కార్నర్ మీటింగులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ తో జత కలిశాడని ఆరోపించాడు. బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు లోపాయికారి ఒప్పందం కలిగి ఉన్నాయని అన్నారు. మొన్న ఖమ్మం నగరంలో బస్సు యాత్ర చేసిన

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నామ నాగేశ్వరరావును గెలిపిస్తే కేంద్రం మంత్రి ఎలా అవుతారని ప్రశ్నించారు. ఈ రెండు పార్టీలు కలిసి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నాయని అన్నారు. ప్రజల శ్రేయస్సుని మరిచి, అధికారం కోసం పాకులాడే బీఆర్ఎస్, బీజేపీలకు ప్రజలు బుద్ధి చెప్పి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రామిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎంపీ అభ్యర్థి రామ సహాయం రామిరెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలస్వామి లక్ష్మీనారాయణ, రామ సహాయం నరేష్ రెడ్డి, చావా శివరామకృష్ణ, మహిళా నాయకురాలు స్వర్ణకుమారి, ఎంపీపీ మంగీలాల్, బెల్లం శ్రీనివాస్, కొమ్ము శ్రీను, ఉన్నాం రాజశేఖర్, తాటికొండ కిరణ్, పోలెపొంగు సంజీవులు, శ్యాం సుందర్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed