సీసీ కెమెరాలతోనే నేరాలు అదుపు

by Disha Web Desk 1 |
సీసీ కెమెరాలతోనే నేరాలు అదుపు
X

జిల్లా సీపీ విష్ణు ఎస్‌ వారియర్‌

దిశ.కారేపల్లి : సీసీ కెమెరాలతో నేరాలు అదుపులో ఉన్నాయని జిల్లా సీపీ విష్ణు ఎస్‌ వారియర్‌ అన్నారు. కారేపల్లిలో శుక్రవారం సింగరేణి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయంలో సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ అరిఫ్‌ అలీఖాన్‌ అధ్యక్షతన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలోనే అత్యధికంగా సీసీ కెమేరాలు 65శాతంగా ఉన్న రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిందని ఆయన పేర్కొన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల అదుపు, నేరస్థుల గుర్తింపు కూడా సులభతరం అవుతోందన్నారు. ఏ ప్రాంతంలో సీసీ కెమెరా ఉంటే అక్కడ పోలీస్ ఉన్నట్లేనని ఆయన అన్నారు. నేను సైతం, ఫ్రెండ్లీ పోలీసింగ్‌ కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వామ్య చేస్తూ ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఏ మూలన దొంగతనం జరిగినా.. వెంటనే దొంగ దొరికే రోజులు రాబోతున్నాయని తెలిపారు. అదేవిధంగా పోలీస్‌ స్టేషన్‌ పైన ఉన్న సర్కిల్‌ కార్యాలయాన్ని అన్ని హంగులతో అనతి కాలంలోనే దాతల సహకారంతో పోలీస్‌ క్వార్టర్‌లో ప్రారంభించడంపై సీఐ అరిఫ్‌ అలీఖాన్‌ను అభినందించారు.

దివ్యాంగుడికి ట్రై సైకిల్‌ అందజేత..

చేతన పౌండేషన్‌ స్వచ్ఛంధ సంస్ధ అంధజేసిన ట్రై సైకిల్‌ను సీపీ విష్ణు ఎస్‌ వారియర్‌ పోలంపల్లికి చెందిన దివ్యాంగుడైన భూపతికి అందజేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌, సమాజ సేవల్లో చురుకుగా పాల్గొంటున్న ఎస్సై పుష్పాల రామారావు, స్వచంధ సంస్ధలను కొనియాడారు. అంతకు ముందు సర్కిల్‌ కార్యాలయంలో మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం రూరల్‌ ఏసీపీ జీ.బస్వారెడ్డి, ఎంపీపీ మాలోత్‌ శకుంతల, కారేపల్లి, కామేపల్లి ఎస్సైలు పుష్పాల రామారావు, కిరణ్‌, చీమలపాడు సర్పంచ్‌ మాలోత్‌ కిషోర్‌, టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి ఇస్లావత్‌ బన్సీలాల్‌, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed