రంగులు మార్చే ఊసరవెల్లి.. పరుగులు పెడుతున్న గ్రామస్తులు

by Web Desk |
రంగులు మార్చే ఊసరవెల్లి.. పరుగులు పెడుతున్న గ్రామస్తులు
X

దిశ, తిరుమలాయపాలెం: ఊసరవెల్లి దీనికి పెద్దగా పరిచయం అక్కర్లేదు. దాదాపు ప్రతి ఒక్కరూ దీన్ని చూసే ఉంటారు. ఊసరవెల్లి దాని రంగులు మార్చే స్వభావానికి ఫేమస్. దాని రంగులు మార్చే స్వభావాన్ని బట్టి పూర్వీకులు చాలానే సామెతలు సృష్టించారు. ఊసరవెల్లి శత్రువుల నుంచి తనను తాను కాపాడుకోవడానికి, వేటాడే సమయంలో తన రంగులు మారుస్తూ ఉంటుంది. ఒక ఊసరవెల్లి రంగులు మార్చేందుకు దాని శరీరానికి ఉండే ఫొటోనిక్ క్రిస్టల్ అని పిలువబడే పొర సహాయపడుతుంది. ఇది ఊసరవెల్లి చుట్టుపక్కల పరిస్థితులకు అనుగుణంగా రంగులు మార్చేందుకు సహాయపడుతుంది. ఇలా రంగులు మార్చే ఊసరవెల్లి చాలా అరుదుగా కనిపిస్తుంటుంది. అటువంటిదే స్థానిక మండల కేంద్రం తిరుమలాయపాలెం గ్రామంలోని పిఏసీఎస్ కార్యాలయం వెనకవైపు బుధవారం కనిపించింది. దీన్ని చూసేందుకు ఊరంతా పరుగులు తీస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో ఇదే హాట్ టాపిక్‌గా మారింది.

Next Story

Most Viewed