దేశంలో ఆదివాసీలు ఎక్కడైనా జీవించవచ్చు : MP Soyam Bapu Rao ఎంపీ సోయం బాబురావు

by Disha Web Desk 15 |
దేశంలో ఆదివాసీలు ఎక్కడైనా జీవించవచ్చు :  MP Soyam Bapu Rao ఎంపీ సోయం బాబురావు
X

దిశ ,చండ్రుగొండ : ఆదివాసీ లు భారతదేశంలో ఎక్కడైనా ఉండవచ్చు, తిరగవచ్చని, వారిని వద్దని చెప్పే అధికారం ఎవరికీ లేదని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబురావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలోని ఎర్రబోడును ఆదివారం సందర్శించారు. ఎర్రబొడులో గొత్తి కోయిల జీవనశైలి, మౌలిక పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ బాబురావు మాట్లాడుతూ పోడు సాగు భూములకు పట్టలివ్వడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విఫలమయ్యారని ఆరోపించారు. ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఎర్రబోడులో రోడ్డు, తాగునీరు, కరెంటు, అంగన్వాడి, హెల్త్, సబ్ సెంటర్లు ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పోడు సాగు చేస్తున్న ఆదివాసీలను ఫారెస్ట్, పోలీసులు వేధింపులకు గురి చేయడాన్ని విరమించుకోవాలని తెలిపారు. ఎర్రబోడు వలస ఆదివాసీల సమస్యలపై పార్లమెంట్లో జీరో అవర్ లో మాట్లాడతానని, అవసరమైతే ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఎర్రబోడులో 8వ తరగతి చదివి మానేసిన రవ్వ వెంకట్రావు విద్యా వాలంటరీగా పనిచేసి చిన్నారులకు చదువు చెప్పాలని, నెల జీతం తానే ఇస్తానని తెలిపారు. సీఎం కేసీఆర్ ఎర్రబోడు సందర్శించి వలస ఆదివాసుల సమస్యలపై స్వయంగా పర్యవేక్షించాలని కోరారు. సీఎం రాలేని పరిస్థితి నెలకొంటే ఆఫీసర్లను పంపాలని కోరారు. ఎర్రబోడులోని 40 గుత్తి కోయ కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి, తొమ్మిది తెగల ఆదివాసీల సమన్వయకర్త రామకృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ బాలరాజు, ఆధార్ సొసైటీ కార్యదర్శి పాపయ్య, ఆదివాసి మండల నాయకులు సురేష్,మహేష్, మల్లం కృష్ణయ్య, నాగభూషణం, వెంకటేష్, బీజేపీ మండల అధ్యక్షుడు భోగి కృష్ణ, జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి జ్యోతి, సత్యనారాయణ రెడ్డి, రాంబాబు, రవీందర్ రెడ్డి, రాంపండు, జాగంటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed