- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నూతన పాలకవర్గాన్ని అభినందించిన మల్లు నందిని
చింతకాని మండల కేంద్రం గ్రామ పంచాయితీకి నూతన పాలకవర్గం ఎన్నికైంది. ఈ సందర్భంగా శనివారం మధిర క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని విక్రమార్కను కలిశారు.

దిశ చింతకాని: చింతకాని మండల కేంద్రం గ్రామ పంచాయితీకి నూతన పాలకవర్గం ఎన్నికైంది. ఈ సందర్భంగా శనివారం మధిర క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని విక్రమార్కను చింతకాని సర్పంచ్,కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కిలారు మనోహర్ బాబు, ఉప సర్పంచ్ కోల ఉమ రాణి, వార్డు సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. మల్లు నందిని విక్రమార్క నూతనంగా ఎన్నికైన పాలక వర్గం సభ్యులని శాలుతో సన్మానించి అభినందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. చింతకాని మండల కేంద్ర గ్రామ పంచాయితీ అభివృద్ధికి అన్ని విధాలుగా సాహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో సర్పంచ్ స్థానాన్ని కైవసం చేసుకోవడం వల్ల చింతకానిలో పార్టీ ఎదుగుదలకు మంచి వాతావరం ఏర్పడిందని కిలారు మనోహర్ బాబును అభినందించారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కిలారు బాబూరావు,కోల ఉమ రాణి నాగేశ్వరరావు,షేక్ రహ్మతుల్లా,గంధసిరి లలిత,వేముల కొండలరావు,పొనుగోటి బాబు,మాతంగి నాగరాజు పాల్గొన్నారు.
- Tags
- khammam






