‘మా పార్టీలోకి వస్తే.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డే డిప్యూటీ సీఎం’

by Disha Web Desk 2 |
‘మా పార్టీలోకి వస్తే.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డే డిప్యూటీ సీఎం’
X

దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రజాశాంతి పార్టీలోకి వస్తే డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ భరోసా ఇచ్చారు. ఖమ్మంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. గెలిచిన తర్వాత తాను ముఖ్యమంత్రిగా.. పొంగులేటి ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని పిలుపునిచ్చారు. మరోవైపు, ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద దుర్ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని మోడీ రాజీనామా చేయాలని పాల్‌ డిమాండ్‌ చేశారు. అమిత్ షా తర్వాతి ప్రధాని కావాలన్నారు.


కాగా, బీఆర్ఎస్‌కు గుడ్‌ బై చెప్పిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఏ పార్టీలో చేరతారోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బీజేపీ చేరతారా..? లేదా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారా..? అనే విషయంపై సందిగ్ధం నెలకింది. మరో వారం రోజుల్లోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కచ్చితంగా బీఆర్ఎస్‌ను ఓడించే పార్టీలోనే చేరతానని పొంగులేటి చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజా శాంతి పార్టీ కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ పార్టీలోకి రావాలని కోరారు.



Next Story

Most Viewed