'చేయి'స్తున్న కీలక నేతలు.. హంగ్ ఏర్పడితే రేవంత్ రెడ్డే కింగ్ మేకర్..

by Disha Web Desk 4 |
చేయిస్తున్న కీలక నేతలు.. హంగ్ ఏర్పడితే   రేవంత్ రెడ్డే కింగ్ మేకర్..
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణను ఇచ్చినా కాంగ్రెస్‌కు రాష్ట్రంలో కలిసిరావడం లేదు. కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో ఎలాగైనా బలోపేతం చేయాలని రానున్న ఎన్నికల్లో సత్తా చాటాలని ఆ పార్టీ అధిష్టానం అనేక మార్లు తర్జనభర్జన చేసి రేవంత్ రెడ్డిని టీ పీసీసీ అధ్యక్షుడిగా నియమించింది. 2021 జూన్‌లో ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానంలో రేవంత్ రెడ్డికి పగ్గాలు అప్పగించింది. ఆయన జూలై 7న బాధ్యతలు స్వీకరించారు. పగ్గాలు చేపట్టిన నాటి నుంచి రేవంత్ రెడ్డికి సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి.

అందరి టార్గెట్ ఆ ఒక్కడే..

టీపీసీసీ ఆశించిన కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వ్యతిరేక స్వరం వినిపిస్తూనే ఉన్నారు. పీసీసీ దక్కనందుకు పార్టీ వ్యవహారాల్లో అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దాసోజు శ్రవణ్ రేవంత్ రెడ్డి తీరు నచ్చక పార్టీ మారారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డిని అనేక మార్లు మీడియా ముందు కడిగిపాడేశారు. పార్టీకి రాజీనామా చేసి బీజేపీ నుంచి ఉప ఎన్నికలకు వెళ్లారు. జగ్గారెడ్డి ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి మునుగోడు ఫలితంపై జూమ్ మీటింగ్ పెట్టడం ఏంటని ఫైర్ అయ్యారు. వీహెచ్ రేవంత్‌ను ప్రతి సారి టార్గెట్ చేస్తునే ఉంటారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత కూడా పార్టీ మరింత బలహీనపడుతూ వస్తోంది. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్, మాజీ మేయర్ బండా కార్తీకా రెడ్డి పార్టీని వీడి బీజేపీలోకి చేరారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి ఏం చేయబోతున్నారనే ఆసక్తి నెలకొంది. పీసీసీ చీఫ్ గా నియమితుడవగానే పాదయాత్ర ప్రారంభిస్తాడని అంతా అనుకున్న ఆయన చేపట్టలేదు. పాదయాత్ర చేస్తే తమ పార్టీకి మైలేజ్ పెరుగుతుందని ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్లవచ్చనే అభిప్రాయం కాంగ్రెస్ కార్యకర్తల నుంచి వ్యక్తమవుతోంది. కానీ కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి పాదయాత్రపై కూడా విమర్శానాస్ర్తాలు సంధిస్తున్నారు. పాదయాత్ర చేసి పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొస్తారా అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. ఆయన పాదయాత్ర చేసేది పార్టీ కోసమా లేక వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవడానికా అని ప్రశ్నించారు.

హంగ్ ఏర్పడితే తానే కీలకం..

కాంగ్రెస్ కు క్యాన్సర్ సోకిందని ఇటీవల పార్టీని వీడనున్నట్లు ప్రకటించిన మర్రిశశిధర్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొంత మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుని సొంత పార్టీ పెట్టుకుంటాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. వచ్చే ఎన్నికల్లో ఒక వేళ హంగ్ ఏర్పడితే రేవంత్ గెలిపించుకునే ఆ ఎమ్మెల్యేలే ప్రభుత్వ ఏర్పాటులో కీలకం అయ్యే ఛాన్స్ కూడా ఉంది. దీంతో రేవంత్ రెడ్డే కింగ్ మేకర్ అయ్యే ఛాన్స్ ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత తమకు కలిసివస్తుందని కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవచ్చని.. బీజేపీతో తీవ్ర సిద్ధాంత వైరుద్యం ఉన్న నేపథ్యంలో టీ కాంగ్రెస్ టీఆర్ఎస్ తోనే పొత్తు పెట్టుకుని ప్రభుత్వం ఏర్పటు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇటీవల మునుగోడు ఉప ఎన్నికల్లో వామపక్షాలను మచ్చిక చేసుకన్న కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో హంగ్ ఏర్పడితే కాంగ్రెస్‌ తో చేతులు కలిపి ముందుకు సాగేందుకు పెద్దగా ఆలోచించరు.

నైరాశ్యంలో పార్టీ శ్రేణులు..

వరుస ఓటములు, ఎక్కడా తమ ఉనికిని బలంగా చాటుకోకపోవడం వెరసి తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది. 2018 తర్వాత వరుసగా ఐదు ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి చవిచూసింది. ఇందులో రెండు కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలే కావడం గమనార్హం. మునుగోడులో కూడా డిపాజిట్ కోల్పోయింది. ఇలాంటి ఫలితాలు తరచూ పునరావృతం అవుతుండటంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. అసలే పార్టీ వరుస ఓటములతో సందిగ్ధంలో ఉంటే పార్టీ ఫిరాయింపులు, తీవ్ర విమర్శలు పార్టీకి మరిన్ని చిక్కులు తెచ్చి పెడుతున్నాయని సొంత పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో బీజేపీకి 119 స్థానాల్లో సంస్థాగతంగా క్యాడర్ లేకున్నా కాంగ్రెస్‌కు మాత్రం మెండుగా ఉంది. మరి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టి తెలంగాణలో పార్టీకి ఊపునిస్తారా.. వచ్చే ఎన్నికల్లో గెలిచిన సీట్లతో హంగ్‌ ఏర్పడితే చక్రం తిప్పుతారా అనేది తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే..


Next Story

Most Viewed