RRRకు షాక్ ఇచ్చేందుకు KCR స్కెచ్.. అందుకే గులాబీ బాస్ దూకుడు పెంచారా?

by Disha Web Desk 4 |
RRRకు షాక్ ఇచ్చేందుకు KCR స్కెచ్.. అందుకే గులాబీ బాస్ దూకుడు పెంచారా?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో చాపకింద నీరులా విస్తరిస్తున్న బీజేపీ పార్టీని నిలువరించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నారు. బీజేపీకి ఎలాగైనా చెక్ పెట్టేందుకు ఇప్పటికే వ్యూహరచన చేసిన గులాబీ బాస్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో వేగం పెంచారు. తనను ప్రశ్నించే నేతలను, ఎదిరించే గొంతులను సహించని కేసీఆర్ ఈ సారి ముగ్గురు బీజేపీ నేతలే టార్గెట్‌గా గేమ్ స్టార్ట్ చేశారు.

అందులో భాగంగా ఈటల బీజేపీలో కీ రోల్ పోషించే ఛాన్స్ ఉన్నందున హుజురాబాద్ ఎమ్మెల్యేకు చెక్ పెట్టేందుకు అభ్యర్థి అంశంలో ఇప్పటికే ఓ క్లారిటీ ఇచ్చారు. హుజురాబాద్ అసెంబ్లీ ఇన్‌ఛార్జిగా పాడి కౌశిక్ రెడ్డిని నియమించారు. దళిత ఓటర్లను ఎట్రాక్ట్ చేసేందుకు ఇటీవల అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు స్పెషల్ గెస్ట్‌గా వచ్చిన ప్రకాశ్ అంబేడ్కర్‌ను ప్రత్యేక హెలికాప్టర్‌లో హుజురాబాద్‌కి పంపి అక్కడ దళిత బంధు పథకం అమలును పరిశీలించేలా చేశారు.

తద్వారా దళితులకు తామేం చేస్తున్నామో ప్రజల్లోకి మెసెజ్ వెళ్లేలా ప్లాన్ చేసుకున్నారు. బీజేపీ అధ్యక్షుడి రేసులో ఈటల పేరు వినిపించడం, కాషాయ పార్టీ ఈటలకు టాప్ ప్రియారిటీ ఇవ్వడంతో కేసీఆర్ అలర్ట్ అయ్యారు. పార్టీలో చేరికల కమిటీ చైర్మన్‌గా ఉన్న అసెంబ్లీ ఎన్నికల్లోగా ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపుతారని కేసీఆర్ ఓ నిర్ణయానికి వచ్చారు. హుజురాబాద్ ఎన్నికల తర్వాత ఆ సెగ్మెంట్ పాలిటిక్స్‌పై కేసీఆర్ కాస్తా వెనక్కి తగ్గారు. తాజాగా మళ్లీ గేర్ మార్చి వేగం పెంచారు.

ఈటల పొలిటికల్ కెరీర్‌ను దెబ్బతీసేందుకు భూములను అక్రమంగా లాక్కున్నడనే అంశాన్ని కారు పార్టీ తెరపైకి తెచ్చింది. కేసీఆర్ వేసిన భూముల వ్యవహారం హుజురాబాద్ ఉప ఎన్నికలో రివర్స్ కావడంతో ఈ సారి మరింత జాగ్రత్తగా ఈటలను దెబ్బకొట్టాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. అందులో భాగంగానే అభ్యర్థి అంశంలో దూకుడుగా వ్యవహరించి కౌశిక్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మరో వైపు రఘునందన్ రావు, రాజాసింగ్‌లపై..

ప్రభుత్వాన్ని కీలక అంశాల్లో కార్నర్ చేయడంలో రఘునందన్ రావు దూకుడుగా వ్యవహరిస్తారు. బీఆర్ఎస్ నేతలను పలు కీలక అంశాల్లో ఇప్పటికే అనేక మార్లు ఇరుకున పెట్టారు. దీంతో ఈ సారి దుబ్బాకలో బలమైన అభ్యర్థిని రంగంలోకి దించి రఘునందన్ రావుకు చెక్ పెట్టేలా కొత్త ప్రభాకర్ రెడ్డిని రంగంలోకి దించారు. నియోజకవర్గ వ్యాప్తంగా కొత్త ప్రభాకర్ రెడ్డి తిరుగుతూ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు.

దుబ్బాక బస్టాండ్ అంశం ఉప ఎన్నికల్లో హాట్ టాపిక్ కాగా కొత్త బస్టాండ్ ను బీఆర్ఎస్ ప్రభుత్వం ఆగమేఘాల మీద నిర్మించింది. ఇక బీజేపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే రాజాసింగ్ విషయంలో కూడా స్పెషల్ ఫోకస్ చేసిన కేసీఆర్ ఇప్పటికే గోషామహల్ ఇన్ ఛార్జిగా నందకిషోర్ వ్యాస్‌ను నియమించారు. 2018లో ఓడిన అభ్యర్థిని గోషామహల్‌లో బీఆర్ఎస్ చీఫ్ పక్కన బెట్టారు. కాగా ఈ సారి నందకిషోర్ వ్యాస్‌ను గోషామహల్ నుంచి బరిలోకి దించాలని కేసీఆర్ ఫిక్స్ అయినట్లు తెలిసింది.

ముఖ్య నేతలను గతంలో పట్టు బట్టి మరి ఓడించిన సీఎం కేసీఆర్ ఈ సారి బీజేపీ నేతలే టార్గెట్‌గా ముందుకెళ్తున్నారు. కొడంగల్‌లో రేవంత్ రెడ్డిని, నల్లగొండలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జానారెడ్డి, అంబర్ పేటలో కిషన్ రెడ్డి లాంటి బలమైన నేతలను 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెలివిగా ఓడించిన కేసీఆర్ ఈ సారి బీజేపీ ముగ్గురు ఎమ్మెల్యేలపై కన్నేశారు. మరి ఈ సారి ఎన్నికల్లో కేసీఆర్ గేమ్ ఛేంజర్ ప్లాన్ ఎలా వర్క్ అవుట్ అవుతుందో వేచి చూడాల్సి ఉంది.



Next Story

Most Viewed