మహారాష్ట్రపై కేసీఆర్ ప్రధాన ఫోకస్

by Disha Web Desk 7 |
మహారాష్ట్రపై కేసీఆర్ ప్రధాన ఫోకస్
X

దిశ, తెలంగాణ బ్యూరో : గులాబీ బాస్ మహారాష్ట్ర పైన ప్రత్యేక ఫోకస్ పెట్టారు. వరుసగా రెండో సభ నిర్వహిస్తున్నారు. కాంధర్ లోహ తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండటంతో దృష్టి సారించారు. స్థానిక సంస్థల్లో పోటీ చేయాలని భావిస్తున్న కేసీఆర్ కాందారు లోహ లో నేడు మధ్యాహ్నం రెండు గంటలకు సభ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో మహారాష్ట్రలోని నాందేడ్‌కు చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక హెలిక్యాఫ్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు లోహా పట్టణ శివారులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.

లోహా నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో బయలుదేరి నేరుగా పట్టణంలోని బైల్‌ బజార్‌ సభాప్రాంగణానికి చేరుకుంటారు. సభా వేదిక పైన కెసిఆర్ సమక్షంలో ఎన్సీపీకి ఇటీవల రాజీనామా చేసిన నేతలు, మాజీ ఎమ్మెల్యే శంకరన్న దోండ్గేతోపాటు కిసాన్‌ సమితి మహారాష్ట్ర అధ్యక్షుడు మానిక్‌రావు కదం, హర్షవర్ధన్‌ జాధవ్‌, సురేశ్‌ గైక్వాడ్‌, యశ్‌పాల్‌ బింగే, నాగ్‌నాథ్‌ గిస్సేవాడ్‌ నేతృత్వంలో మాజీ ఎమ్మెల్యే మనోహర్‌ పట్వారీ, ఎన్సీపీ జిల్లా అధ్యక్షుడు దగ్దా పవార్‌, ఛత్రపతి శివాజీ మరాఠా నవయువక్‌ మండల్‌ ప్రెసిడెంట్‌ మదన్‌ జాధవ్‌, తో పాటు పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు నాయకులు చేరనున్నారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించనున్నారు.

కేసీఆర్ వెంట కవిత

టిఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ వెంట ఎమ్మెల్సీ కవిత, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి వేముల ప్రశాంత్ రెడ్డి లతోపాటు పలువురు నేతలు వెళ్ళనున్నట్లు సమాచారం. జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించాలనుకున్న కేసీఆర్.. కవితను జాతీయ రాజకీయాల్లో వినియోగించుకోవాలని అందుకే మహారాష్ట్ర సభకు తీసుకెళుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోపక్క మహిళా బిల్లు కోసం పోరాటం నిర్వహిస్తుండడంతో ఆ రాష్ట్ర ప్రజల మద్దతు కోరనున్నట్లు సమాచారం.

ఈ నియోజకవర్గాల పైన ప్రత్యేక ఫోకస్

మహారాష్ట్రలోని తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే పర్భణి, లాతూర్‌, నాందేడ్‌ లోక్‌సభా నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లోని కంధార్‌, లోహా, కన్నాడ్‌, పర్భణి, డెగులూర్‌, పూర్ణా, గంగాఖేడ్‌, ముద్ఖేడ్‌, పత్రి, పాలా, చండోలి, చౌక్‌, మన్వర్‌, అహ్మదాపూర్‌, ధర్మాబాద్‌, బిలోలితోపాటు ఇతర నియోజకవర్గాలు, తాలూకాలపై దృష్టి సారించారు. ఇప్పటికే తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను డిజిటల్‌ ప్రచార రథాల ద్వారా జోరుగా ప్రచారం చేశారు. ఆసరా పింఛన్లు, రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తు, కల్యాణలక్ష్మి, కాళేశ్వరం ప్రాజెక్టు తదితర పథకాల విశిష్ఠతలను మరాఠీలో వివరించారు. ప్రజల మద్దతును కూడగట్టేందుకు ఈ సభను వినియోగించుకుంటున్నారు. స్థానిక సంస్థల టార్గెట్ లక్ష్యంగా టిఆర్ఎస్ ముందుకు సాగుతుంది.

Read more:

కారులో వార్..! తారాస్థాయికి చేరిన వర్గపోరు

Next Story

Most Viewed