కేసీఆర్.. మీ కుక్కకున్న విలువ ప్రజలకు లేదా?.. రేవంత్ రెడ్డి ఫైర్

by Disha Web Desk 13 |
కేసీఆర్.. మీ కుక్కకున్న విలువ ప్రజలకు లేదా?.. రేవంత్ రెడ్డి ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: గత ప్రభుత్వం ఫామ్ హౌజ్ మత్తులో మునిగి లక్షలాది మంది నిరుగ్యోగ యువతకు ఉద్యోగాల భర్తీని మర్చిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. సోమవారం ఎల్బీ స్టేడియంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి తదితరులతో కలిసి లెక్చరర్లు, టీచర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి సీఎం నియామక పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. నాకు ఇంగ్లీష్ రాదంటూ గుంటూరు, గుడివాడలో చదువుకొని వచ్చిన వాళ్లు అవహేళన చేస్తున్నారని నేను కార్పొరేట్ స్కూళ్లలో చదువుకోలేదని.. గుంటూరు, గుడివాటలో అసలే చదువలేదన్నారు. ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంలోనే చదివి ఈ స్థాయికి ఎదిగానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చైనా, జపాన్ దేశాలలో చాలా మందికి ఇంగ్లీష్ రాకపోయినా ప్రపంచంతో పోటీ పడి అభివృద్ధి చెందుతున్నాయన్నారు. ఇంగ్లీష్ అనేది ప్రపంచంలో ఉపాధి లభించడానికి ఉపయోగపడే ఒక భాష మాత్రమే అన్నారు. భవిష్యత్ తరాలలో ఇంగ్లీష్ రాని విద్యార్థులు ఉండకూడదని ఈ గురుతర బాధ్యత టీచర్లు, లెక్చరర్లపై ఉందన్నారు. ఇవాళ 6546 ఉద్యోగ నియామకాలు ఇవాళ పంపిణీ చేద్దామనుకున్నప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ప్రస్తుతం 5,192 ఉద్యోగ నియామకాలు ఇస్తున్నామన్నారు. కోడ్ తొలగిపోయాక మిగతా వారికి నియామకపత్రాలు ఇంటికి పంపుతామన్నారు.

మీ పెంపుడు కుక్కకు ఉన్న విలువ ప్రజలకు లేదా?:

ఎందరో ఆత్మబలిదానాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం కుటుంబ పదవుల కోసం పని చేసిదని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో ఉద్యోగాల నియామకాల విషయంలో జరిగిన నిర్లక్ష్యంపై మీరంతా పోరాడారని కేసీఆర్ ఆయన కటుంబ సభ్యుల ఉద్యోగం ఊడగొడితేనే ఉద్యోగాలు వస్తాయని యువత భావించారని రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతోనే మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలకు నియామకపత్రాలు అందజేయగలిగామన్నారు. విద్యామీద పెట్టే ఖర్చు పెట్టుబడి కాదని భవిష్యత్ తరలాను తీర్చిదిద్దే ఇంధనం అన్నారు. రేషనైలైజేషన్ పేరుతో కేసీఆర్ 6 వేల పాఠశాలలను మూసివేశారన్నారు. కులవృతుల వారి పిల్లలు ఆ పనులే చేసుకోవాలని భావించారు. పేదలు గొర్రెలు, బర్రెలు, చేపలు మాత్రమే పెంచాలనట్టుగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. ఆయన మనవడి పెంపుడు కుక్క చనిపోతే వెటర్నరీ డాక్టర్‌ మీద కేసీఆర్‌ కేసు పెట్టారని, మీరు పెంచుకున్న కుక్కకు ఉన్న విలువ ప్రజలకు లేదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నిరుద్యోగుల పట్ల మా ప్రభుత్వానికి సానుభూతి ఉందన్నారు. ఎల్బీస్టేడియంలో నియామకపత్రాల కార్యక్రమం మా ప్రచారం కోసం కాదని, నిరుత్సాహంలో ఆత్మహత్య చేసుకుంటున్న నిరుద్యోగులకు ఓ భరోసా ఇవ్వడానికే ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. టీఎస్ పీఎస్సీ ప్రక్షాళన చేశామని, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చామన్నారు.

పని తీరు చూసే ఓటేయ్యండి:

రకరాకాల వారు రకరకాల మాటలు చెబుతారని కానీ మీరంతా ఆలోచని చేయాలని సీఎం అన్నారు. గడీల్లో బందీ అయినా ప్రభుత్వాన్ని మా ప్రభుత్వం ప్రజల వద్దకు చేర్చిందని ఈ మూడు నెలల్లో మా పనితీరును చూసి రాబోయే అన్ని ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలని పిలుపునిచ్చారు. గతంలో సీఎం గానీ మంత్రులు గానీ ప్రజలను కలిసేవారు కాదని కానీ ఇవాళ మేమంతా ప్రజలను కలుస్తున్నామని ఇదంతా మీరిచ్చిన అవకాశమే అన్నారు. డ్రగ్స్ అనే పదం వినిపించకుండా తెలంగాణ అనే తులసీ వంలో గంజాయి మొక్కలు ఉండవద్దని పోలీసులు ఆదేశాలిచ్చామన్నారు.



Next Story

Most Viewed