అంబేడ్కర్ విగ్రహావిష్కరణ: ఇన్వి‘టెన్షన్’

by Dishafeatures2 |
అంబేడ్కర్ విగ్రహావిష్కరణ: ఇన్వి‘టెన్షన్’
X

దిశ, తెలంగాణ బ్యూరో: అంబేడ్కర్ విగ్రహాన్ని ఈనెల 14న ఆవిష్కరించేందుకు ప్రభుత్వం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమానికి అంబేడ్కర్ మునిమనవడితోపాటు బౌద్ధ భిక్షువులను పిలిచేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ కార్యక్రమానికి ఇంకా ఎవరెవరిని ఆహ్వానిస్తారని చర్చ జరుగుతోంది. ప్రభుత్వ కార్యక్రమం ఏకపక్షంగా జరుగుతుందా? లేక అందరికీ ఇన్విటేషన్ ఉంటుందా? అనే ఆసక్తి నెలకొంది. అయితే విపక్షాల నుంచి ఎవరిని పిలుస్తారా అనే అంశంపై కేసీఆర్ నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. విగ్రహావిష్కరణ తర్వాత భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు. ఈ సభనును ప్రభుత్వ ఖర్చులతోనే నిర్వహిస్తున్నారు.

గవర్నర్‌కు ఇన్విటేషన్ ఉంటుందా?

ప్రభుత్వం అంత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు గవర్నర్ తమిళిసైకి పిలుపు ఉంటుందా? అనే చర్చ జరుగుతోంది. పెండింగ్ బిల్లులను అమోదించడం లేదని ప్రభుత్వం ఆమెపై గుర్రుగా ఉంది. దీనిపై సుప్రీం కోర్టులో కేసు సైతం దాఖలు చేసింది. దీంతో ఆమెను ప్రభుత్వం ఆహ్వానించే అంశంపై ఉత్కంఠ నెలకొంది. గతంలో దళిత బంధు స్కీమ్ గైడ్‌లైన్స్ ఎలా ఉండాలి అనే అంశంపై ప్రగతిభవన్‌లో జరిగిన సమీక్ష సమావేశానికి అన్ని పార్టీల నుంచి దళిత ఎమ్మెల్యేలను ఆహ్వానించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు విపక్షాలు, దళిత సంఘాలను ఆహ్వానం ఉండదేమోననే అనుమానంలో అధికారులు ఉన్నారు.




Next Story

Most Viewed