- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kavitha : ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై కవిత కీలక డిమాండ్ !
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్(SLBC)టన్నెల్ పై కప్పు కూలిన ప్రమాదంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavitha)కీలక డిమాండ్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్(SLBC)టన్నెల్ పై కప్పు కూలిన ప్రమాదంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavitha)కీలక డిమాండ్ చేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం(Tunnel Accident)పై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(NDSA) వెంటనే స్పందించాలని..పనులు మొదలు పెట్టిన వెంటనే ప్రమాదం ఎలా జరిగిందో తేల్చాలని కవిత ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పై కప్పు కూలిన ప్రమాదంలో కూలీలు గాయపడటం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు.
కేసీఆర్ హయాంలో 10 కిలోమీటర్ల మేర టన్నెల్ తవ్వారని.. ఏ ఒక్క రోజూ ఇలాంటి ప్రమాదం జరగలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు రోజుల కిందనే పనులు మొదలు పెట్టిందని..అంతలోనే ఈ పెను ప్రమాదం ఎలా జరిగిందని ? దీనికి ఎవరు బాధ్యులని? కవిత ప్రశ్నించారు. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) ఈ ప్రమాదంపై స్పందించాల్సిన అవసరముందని డిమాండ్ చేశారు. ఇంకా 9 కి.మీ.లకు పైగా టన్నెల్ తవ్వాల్సి ఉందని.. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని.. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని కవిత తెలిపారు.
టీబీఎం మిషన్ల మరమ్మతులు, నిధులు కొరత వంటి సమస్యలతో సుదీర్ఘకాలంగా పనులు ఆగిపోయిన ఎస్ఎల్బీసీ సొరంగం త్రవ్వకం పనులు నాలుగు రోజుల క్రితమే తిరిగి ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం ఎడమవైపు సొరంగంలో పనులు జరుగుతుండగా 14వ కిలోమీటర్ వద్ధ పైకప్పు కూలిపోయింది. ప్రమాద సమయంలో ఆ ప్రాంతంలో 50 మంది కూలీలున్నట్లుగా తెలుస్తుంది. కూలీలను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.






