కొత్తపల్లి రోడ్డుకు మోక్షం ఎప్పుడు..?

by Disha Web Desk 20 |
కొత్తపల్లి రోడ్డుకు మోక్షం ఎప్పుడు..?
X

దిశ, గంభీరావుపేట : గంభీరావుపేట మండలంలోని కొత్తపల్లి గ్రామ శివారులోని కామారెడ్డి సిద్దిపేట ప్రధాన రహదారి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న సిద్దిపేట జిల్లా శిలాజి నగర్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణం కలగానే మారింది. ఏళ్లు తరబడి ఇక్కడి ప్రజలు ప్రజాప్రతినిధులకు అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేస్తున్నా స్పందన మాత్రం కరువైంది. నాయకులు, గ్రామస్తులు డబుల్ రోడ్డు కావాలని నిరాహార దీక్షలు, ధర్నాలు చేసిన ప్రయత్నం లేకుండా పోయింది. రెండు నెలల క్రితం పంచాయతీరాజ్ శాఖ అధికారులు రూ.5 కోట్లతో ప్రతిపాదనలు పంపించారు. కానీ నిధులు మాత్రం ఇప్పటికీ మంజూరు కాలేదు.

రెండు జిల్లాలను కలిపి రహదారి..

రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలను కలిపే ఈ రోడ్డును ఐదు కిలోమీటర్లు డబుల్ రోడ్డుగా మార్చితే అంతర్ జిల్లా రహదారిగా మారునంది. గ్రామానికి అటువైపు ఇటువైపు డబుల్ రోడ్డు ఉన్నాయి. కానీ కొత్తపెళ్లి గ్రామం నుంచి ఐదు కిలోమీటర్లు మాత్రమే డబుల్ రోడ్డు లేదు. కొత్త పెళ్లికి ఆనుకొని ఉన్న సిద్దిపేట జిల్లా శిలాజి నగర్ వరకు డబుల్ రోడ్డు ఉంది. ఇటు గ్రామ శివారులో నుంచి కామారెడ్డి సిద్దిపేట ప్రధాన డబుల్ రోడ్డు వెళ్తుంది. రెండిటిని అనుసంధానం చేస్తే రాకపోకలకు సౌకర్యంగా ఉంటుందని ప్రజలు అంటున్నారు.

రోడ్డు పై ప్రయాణం చేయాలంటే భయంగా ఉంది..

కొత్తపల్లి రోడ్డు నుంచి సిద్దిపేట జిల్లా శిలాజి నగర్, గంభీర్పూర్, చికోడ్, దుబ్బాక, రామక్కపేట, ఆకారం గ్రామాలతో పాటు జిల్లాలోని కొత్తపెళ్లి శ్రీ కాదా, రాజుపేట, కోళ్లమద్ది, లింగన్నపేట గ్రామాల ప్రజలు నిత్యం ప్రయాణం చేస్తుంటారు. ఇటు సిద్దిపేట అటు కామారెడ్డి పట్టణాలకు వెళ్లాలంటే అదే ప్రధానమైన రోడ్డు. ఈ రోడ్డు సింగిల్ రోడ్డు కావడం అక్కడక్కడ గుంతలు పడడంతో ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు.

Next Story